“ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువువలన స్వాతంత్ర్యము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడైయుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు”. (1 కొరింథీ 7:22)
“ప్రభువు”కి (అనగా యజమానుడు) బదులుగా “క్రీస్తు” (అనగా మెస్సీయ) అని పౌలు వ్రాయాలని నేను ఆశించేవాడిని.
మన విమోచనకు (“ప్రభువువలన స్వాతంత్ర్యము పొందినవాడు”), యేసు మన యజమానుడు (“క్రీస్తు దాసుడు”) అనే మాటకు పరస్పర సంబంధం ఉందని పౌలు వ్రాస్తున్నాడు. ఈ మాటలు విచిత్రంగా అనిపిస్తున్నాయి ఎందుకంటే సాధారణంగా యజమానులు తమ దాసుల జీవితాలను నియంత్రిస్తారు; కానీ మెస్సీయ తన ప్రజలను వారి బంధకములనుండి విడిపించడానికి వచ్చాడు.
పౌలు ఎందుకు ఇలా అంటున్నాడు? దాసుడుకి(స్వాతంత్ర్యముకి బదులు) మెస్సీయతో, మరియు స్వాతంత్ర్యమును (దాసుడుకి బదులు) యజమానితో ఎందుకు ముడి పెట్టాడు?
సలహా: ఈ పరస్పర మార్పు మన కొత్త స్వేచ్ఛపై రెండు ప్రభావాలను మరియు మన కొత్త బానిస్త్వంపై రెండు ప్రభావాలను చూపుతుంది.
ఒకవైపు, మనలను “ప్రభువువలన స్వాతంత్ర్యము పొందినవాడు.” అని పిలవడంలో, పౌలు మన కొత్త స్వేచ్ఛ భద్రమని మరియు పరిమితం అని చెప్తున్నాడు:
1. ఈ ప్రభువు ఇతర ప్రభువులు అనబడిన వారందరినీ ఏలేవాడు కాబట్టి మన స్వాతంత్ర్యమును ఎవరు సవాలు చేయలేరు – ఖచ్చితంగా సురక్షితం.
2. కానీ, ఇతర ప్రభువులనబడిన వారందరి నుండి స్వాతంత్ర్యము పొంది, మనము ఆ ఒక్క ప్రభువు నుండి స్వాతంత్ర్యము పొందలేదు. అయన దయాసంకల్పమును బట్టి మన స్వేచ్ఛ పరిమితం చేయబడింది. యేసే మన యజమాని.
మరోవైపు, మనలను “క్రీస్తు దాసులు” అని పిలవడంవలన, పౌలు మన దాస్యత్వాన్నితేలికగా, మనోహరమైనదిగా చెప్తున్నాడు:
1. బంధకాల పరిమితుల నుండి శాంతికరమైన బహిరంగ ప్రదేశాల్లోకి వారిని తీసుకురావడానికి మెస్సీయ తనవారిపై హక్కు కలిగిఉంటాడు. “ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు…” (యెషయా 9:7)
2. మరియు వారికి మధురమైన ఆనందాన్ని ఇవ్వడానికి అతను వారిని తన స్వంతం చేసుకుంటాడు. “కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును.” (కీర్తన 81:16). మరియు మెస్సీయ అనబడిన క్రీస్తే ఆ కొండ.
కాబట్టి, క్రైస్తవుడా వీటిలో సంతోషించు: “ప్రభువులో బానిసగా పిలువబడినవాడు ప్రభువు (యజమాని) వలన స్వాతంత్ర్యము పొందినవాడు”. “అలాగే స్వతంత్రుడిగా పిలవబడినవాడు క్రీస్తు(స్వేచ్ఛనిచ్చే, మదురమైనమెస్సీయ)కు దాసుడు”