“ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుటవలనను,… రక్షణపొందుటకు దేవుడు ఆదినుండి మిమ్మును ఏర్పరచుకొనెను…” (2 థెస్స 2:13)

జగదుత్పత్తికి ముందుగానే క్రీస్తులో (ఎఫెసీ 1:4), మనం మంచి చెడులనేవాటిని చేయకముందే (రోమా 9:11) మన ఏర్పాటును గురించి, దేవుడు మనల్ని ఎన్నుకొన్న విధానము గురించి బైబిల్ మాట్లాడుతోంది. అందుచేత, కఠినమైన అర్థంలో మన ఏర్పాటు బేషరతుతో కూడుకున్నది. ఈ ఏర్పాటుకు మన విశ్వాసం గాని, మన విధేయత గాని ఆధారం కావు. ఇది పూర్తిగా ఉచితం మరియు దీనికి మనం పూర్తిగా అనర్హులం.

ఇంకొక విధంగా చూసినట్లయితే, మన అంతిమ రక్షణ (నిత్యత్వంలో మన ఎన్నికకు వ్యతిరేక౦గా) మారిన హృదయం మీద, జీవితం మీద ఆధారపడి ఉందని బైబిలులోని అనేక వాక్యభాగాలు మాట్లాడుతున్నాయి. అందుచేత, నిత్యజీవాన్ని వారసత్వంగా పొందడానికి అవసరమైన విశ్వాసాన్ని, పవిత్రతను నేను కొనసాగిస్తాననే భరోసాను నేను ఎలా పొందగలను? అనే ప్రశ్న తలెత్తుతుంది.

ఈ ప్రశ్నకు జవాబు, ఆ భరోసా అనేది మన ఎన్నికలోనే వేరుపారియున్నది. “అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసికొనుటకు మరి జాగ్రత్తపడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్రిల్లరు. ఆలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుయొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును” అని రెండవ పేతురు 1:10-11 వచనాలు సెలవిస్తున్నాయి. దైవిక ఏర్పాటు అనేది నన్ను రక్షించడానికి దేవుని నిబద్దత యొక్క పునాదియైయున్నది. అందుచేత, ఆయన ఎన్నుకునే కృప, అంటే పవిత్రీకరించే కృప ద్వారా నాలో కార్యం చేయడానికి ఆయన పూనుకుంటాడు.

ఇదే క్రొత్త నిబంధనకు అర్థం. యేసును విశ్వసించిన ప్రతి ఒక్కరు క్రొత్త నిబంధనకు సంబంధించి భద్రతతో కూడిన ప్రయోజనాన్ని పొందియున్నారు, ఎందుకంటే “ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని – ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన” అని లూకా 22:20 వచనంలో యేసు చెప్పాడు. అంటే, నాకు సంబంధించిన వారందరి కోసం నా రక్తం ద్వారా నేను క్రొత్త నిబంధనను భద్రం చేసియున్నాను.

క్రొత్త నిబంధనలో దేవుడు విధేయతను మాత్రమే ఆజ్ఞాపించలేదు; ఆయన దానిని ఇస్తున్నాడు. “నీవు బ్రదుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను, నీ దేవుడైన యెహోవాను ప్రేమించునట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతివారి హృదయమునకును సున్నతి చేయును” (ద్వితీయో 30:6). “నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించువారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను” (యెహెజ్కేలు 36:27; 11:20). అవన్నియు క్రొత్త నిబంధన వాగ్దానాలు.

ఏర్పాటు (ఎన్నిక) అనేది దేవుడు తన ప్రజల కోసం చేసేటువంటి ఆయన నిత్యత్వపు నిబద్ధతయైయున్నది. అందుచేత, విశ్వాసం ద్వారా దేవుడు ఎవరిని నీతిమంతులనుగా నిర్ణయిస్తాడో వారిని ఖచ్చితంగా మహిమపరుస్తాడని ఏర్పాటు (ఎన్నిక) మనకు హామినిస్తోంది (రోమా 8:30). అంటే, మహిమపరచడం కోసం విధించబడిన షరతులన్నిటిని పాటించుట కోసం మనలో ఆయన నిర్విరామంగా పని చేస్తాడని అర్థం.

ఏర్పాటు అనేది రక్షించడానికి దేవుని నిబద్ధత అయినందున ఇది భరోసా (హామి) యొక్క అంతిమ పునాది. రక్షణకు అవసరమైన వాటినన్నిటిని సమకూర్చడం కూడా దేవుని నిబద్ధతయైయున్నది.

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *