“నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు”. (మత్తయి 5:11)
“అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడియున్నవని సంతోషించుడని వారితో చెప్పెను”. (లూకా 10:20)
“తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించినవారును నాతో కూడ ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడకమునుపే నీవు నన్ను ప్రేమించితివి”. (యోహాను 17:24)
“నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగునవారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి” (మత్తయి 5:11-12) అని యేసు చెప్పినట్లుగా ఆయన మన శ్రమల నుండి మన ఆనందాన్ని కాపాడుతాడు. పరలోకమందలి మన బహుమానం, ఇక్కడి శ్రమలు మరియు దూషణల బెదిరింపుల నుండి మన ఆనందాన్ని సంరక్షిస్తుంది.
“అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడియున్నవని సంతోషించుడి” (లూకా 10:20) అని యేసు చెప్పినప్పుడు, విజయం నుండి వచ్చే ఆనందాన్ని కూడా ఆయన కాపాడుతాడు. పరిచర్యలో లభించే విజయంలో ఆనందం కలిగి ఉండాలని శిష్యులు శోధించబడ్డారు. “…ప్రభువా, దయ్యములు కూడ నీ నామమువలన మాకు లోబడుచున్నవి!” (లూకా 10:17). కానీ అలా చేయడం, వారి సంతోషాన్ని వారి ఆనందపు లంగరు (ఆంకర్) నుండి తీసివేసేది. కాబట్టి పరలోకము యొక్క గొప్ప బహుమానమును వాగ్ధానము చేయుట ద్వారా యేసు వారి ఆనందమును విజయమనే ముప్పు నుండి సంరక్షిస్తాడు. పరలోకమందు మీ పేర్లు వ్రాయబడినాయని ఆనందించండి. మీరు పొందుకునే స్వాస్థ్యం అనంతం, శాశ్వతం, ఖచ్చితం.
మన ఆనందం భద్రంగా ఉంది. శ్రమ లేదా విజయం, ఆనందమునకున్న లంగరును నాశనం చేయదు లేదా తీసివేయదు. పరలోకంలో మీరు పొందబోవు బహుమానం చాలా గొప్పది. అక్కడ మీ పేరు వ్రాయబడి ఉంది. అది భద్రపరచబడి ఉంది. శ్రమలు ఎదుర్కొంటున్న పరిశుద్ధుల ఆనందాన్ని, పరలోకపు బహుమానములో యేసు భద్రపరిచాడు. అదే బహుమానములో విజయవంతమగు పరిశుద్ధుల ఆనందమును కూడా భద్రపరిచాడు.
అందుచేత, ఈ విధంగా, లోకసంబంధమైన శ్రమలు, ఆనందము ; హింస, విజయం నుండి ఆయన మనలను విడిపించెను.