ఓర్పుతో వేచి ఉండగల శక్తి

ఓర్పుతో వేచి ఉండగల శక్తి

షేర్ చెయ్యండి:

ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తినిబట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు,… (కొలొస్స 1:11)

“బలపరచబడ్డారు” అనేది సరియైన మాట. “ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరచునట్లు ఆయన మహిమ శక్తినిబట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెనని” (కొలొస్స 1:11) అపొస్తలుడైన పౌలు గారు కొలొస్సయిలోని సంఘం కోసం ప్రార్థించాడు. ఓర్పు అనేది అంతర్గత బలానికి ఆధారం.

ఓర్పులేనటువంటి వ్యక్తులు తమ బలహీనత కారణంగా ఖచ్చితమైన షెడ్యూల్ మరియు అనుకూలమైన పరిస్థితులు వంటి బాహ్య కారకాలపై ఆధారపడతారు. ఇలాంటివారు తమ ప్రణాళికలకు అంతరాయం కలిగించే వ్యక్తులపట్ల తమ కోపాన్ని, కఠినమైన విమర్శలను, శపథాలను చూపించినప్పుడు బలంగా ఉంటారు. అయితే, ఆ శబ్దమంతా వారి బలహీనతను కప్పివేస్తుంది. ఓర్పుకు అపారమైన అంతర్గత బలం అవసరం.

క్రైస్తవునికైతే ఈ బలం దేవుని నుండి వస్తుంది. అందుచేతనే పౌలు కొలొస్సయుల సంఘం కోసం ప్రార్థిస్తున్నాడు. క్రైస్తవ జీవితానికి కావాల్సిన దీర్ఘశాంతం కనుపరిచే ఓర్పుతో వారందరు బలపరచబడాలని పౌలు దేవుణ్ణి వేడుకుంటున్నాడు. అయితే, ఓర్పుకు సంబంధించిన బలం “[దేవుని] మహిమ శక్తిని బట్టి” ఉండాలని ఆయన చెప్పినప్పుడు, ఓర్పుగల వ్యక్తిగా ఒక మనిషిని చేయడానికి దైవిక శక్తి అవసరమని ఆయన చెప్పడం లేదు గాని ఈ “మహిమ శక్తిలో” ఉంచిన విశ్వాసమే ఓర్పుకు శక్తి వచ్చే మార్గమని ఆయన చెప్తున్నాడు.

ఓర్పు (దీర్ఘశాంతము) అనేది వాస్తవానికి పరిశుద్ధాత్మ ఫలం (గలతీ 5:22), అయితే “విశ్వాసంతో వినడం ద్వారానే” (గలతీ 3:5) పరిశుద్ధాత్ముడు బలపరుస్తాడు (ఆయన ఫలాలన్నిటితో బలపరుస్తాడు). అందుచేతనే, ఓర్పును (దీర్ఘశాంతమును) బలపరిచే “మహిమ శక్తితో” దేవుడు మనతో సంబంధం కలిగియుండాలని పౌలు ప్రార్థిస్తున్నాడు. ఆ సంబంధమే విశ్వాసం.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...