“పేతురును జెబెదయి యిద్దరు కుమారులను వెంటబెట్టుకొనిపోయి, దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను”. (మత్తయి 26:37)

యేసు సిలువ వేయబడటానికి ముందు రోజు రాత్రి ఆయన ఆత్మ స్థితిని గురి౦చి బైబిలు మనకు అద్భుతమైన విషయాన్ని తెలుపుతోంది. నిరాశకు లేదా ధైర్యం చెడిన స్థితికి విరుద్ధంగా యేసు వ్యూహాత్మకంగా పోరాటం చేసిన విధానాన్ని చూసి, దాని నుండి నేర్చుకోండి.

  1. ఆయన తనతోపాటు ఉండేందుకు ప్రియ స్నేహితులను ఎన్నుకున్నాడు. “పేతురును జెబెదయి యిద్దరు కుమారులను వెంటబెట్టుకొనిపోయి ” (మత్తయి 26:37).
  2. ఆయన తన అంతరంగాన్ని వారికి చూపించాడు. “మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది” (మత్తయి 26:38) అని ఆయన వారితో చెప్పాడు.
  3. పోరాటంలో వారి విజ్ఞాపనలు, వారి సహాయం కావాలని ఆయన వారిని కోరాడు. “మీరు ఇక్కడ నిలిచి, నాతో కూడ మెలకువగా ఉండండి” (మత్తయి 26:38) ఆయన వారితో చెప్పాడు.
  4. ఆయన తన తండ్రి ముందు ప్రార్థిస్తూ తన హృదయాన్ని కుమ్మరించాడు. “నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము” (మత్తయి 26:39) అని ఆయన ప్రార్థించాడు.
  5. ఆయన దేవుని సార్వభౌమాధికార జ్ఞానంలో తన ఆత్మకు నెమ్మది పొందుకున్నాడు. “నా యిష్టప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము” (మత్తయి 26:39) అని నెమ్మది పొందాడు.
  6. సిలువకు అవతల వైపు తన కోసం వేచి ఉన్నటువంటి ఉజ్వల భవిష్యత్తు కృపపై ఆయన దృష్టి సారించాడు. “మనము కూడ ప్రతి భారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన యెదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు” (హెబ్రీ 12:2).

మీ భవిష్యత్తుకు ముప్పు కలిగించేది ఏదైనా మీ జీవితంలోకి వచ్చినప్పుడు, ఇక్కడ చెప్పబడిన విషయాన్ని గుర్తుంచుకోండి: ఒకనాడు గెత్సేమనే తోటలో యేసు అనుభవించినట్లు, మీ హృదయంలో బాంబు విస్పోటనమైనప్పుడు కలిగే అలజడి తరంగాలు పాపం కాదు. వాటికి లొంగిపోయి, ఎటువంటి ఆధ్యాత్మిక పోరాటం చేయకపోవడమే ప్రమాదకరమైన విషయం. అంతేగాకుండా, పాపభూయిష్టముగా లొంగిపోవడానికి గల మూలం అవిశ్వాసం, అంటే భవిష్యత్తులోని కృపపై పెట్టాల్సిన విశ్వాసం కోసం పోరాడడంలో విఫలమవడమని అర్థం. యేసునందు మనకివ్వబడిన దేవుని వాగ్దానలన్నిటిని ఆనందించడంలో విఫలం చెందడం.

గెత్సేమనే తోటలో యేసు మనకు మరొక విధానాన్ని చూపించాడు. బాధాకరమైనది కాదు, పరోక్షంగా పోరాడేది కాదు. ఆయనను వెంబడించే మార్గాన్ని చూపించాడు. నమ్మదగిన ఆధ్యాత్మిక స్నేహితులను కనుగొనండి. వారితో మీ అంతరంగాన్ని పంచుకోండి. మిమ్మల్ని చూసి, మీ కోసం ప్రార్థించమని వారిని అడగండి. మీ అంతరంగాన్ని తండ్రి ఎదుట కుమ్మరించండి. మిగిలినదంతా దేవుని సార్వభౌమాధికార జ్ఞానానికి వదిలిపెట్టండి. దేవుని శ్రేష్టమైన, అద్భుతమైన వాగ్దానాలలో మీ ముందు ఉంచబడిన ఆనందం మీద మీ దృష్టిని పెట్టండి.

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *