క్రీస్తు యేసులో ఉన్నారనడానికి ఆరు విషయాలు

షేర్ చెయ్యండి:

“మన క్రియలనుబట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు, అనాదికాలముననే క్రీస్తుయేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షతవలన బయలుపరచబడి నదియునైన తన కృపనుబట్టియు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను”. (2 తిమోతి 1:9-10)

“క్రీస్తుయేసునందు” ఉండడం ఒక అద్భుతమైన వాస్తవికత. క్రీస్తుతో ఐక్యం కావడం ఉత్కంఠభరితమైనది. క్రీస్తుకు కట్టబడ్డారు.

మీరు “క్రీస్తులో” ఉన్నట్లయితే, దాని అర్థం ఏమిటో వినండి:

1. లోకము సృజింపబడకమునుపే క్రీస్తుయేసునందు మీకు కృప లభించింది. 2 తిమోతి 1:9, “అనాదికాలముననే క్రీస్తుయేసునందు మనకు అనుగ్రహింపబడినదియు.”

2. క్రీస్తుయేసులో మీరు సృష్టికి ముందు దేవునిచే ఎన్నుకోబడ్డారు. ఎఫెసీ 1:6, “జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన [దేవుడు] క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.”

3. క్రీస్తు యేసులో మీరు విడదీయరాని ప్రేమతో దేవునిచే ప్రేమించబడ్డారు. రోమా 8:38-39, “మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.”

4. క్రీస్తుయేసులో మీరు విమోచించబడ్డారు మరియు మీ పాపాలన్నీ క్షమింపబడ్డాయి. ఎఫెసీ 1:7, “ఆ ప్రియునియందు [క్రీస్తు] ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.”

5. క్రీస్తుయేసునందు మీరు దేవుని యెదుట నీతిమంతులుగా తీర్చబడుచున్నారు మరియు క్రీస్తులోని దేవుని నీతి మీకు ఆపాదించబడుచున్నది. 2 కొరింథీ 5:21, “మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను [క్రీస్తును] మనకోసము పాపముగాచేసెను.”

6. క్రీస్తుయేసునందు నీవు నూతన సృష్టి మరియు దేవుని కుమారుడవైయున్నావు. 2 కొరింథీ 5:17, “ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;” గలతీ 3:26, “యేసుక్రీస్తునందు మీరందరు విశ్వాసమువలన దేవుని కుమారులై యున్నారు.””క్రీస్తు యేసునందు” అనే తరగని ఆధిక్యతను అన్వేషించడంలో మరియు ఆనందించడంలో మీరు ఎప్పటికీ అలసిపోకూడదని నేను ప్రార్థిస్తున్నాను.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...