పాపం, సాతాను, రోగం, లేదా నాశనం
“అది నాయొద్దనుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును”. (2 కొరింథీ 12:8-9)
క్రైస్తవుడికి హింస వల్ల వచ్చే బాధ క్యాన్సర్ వల్ల వచ్చే బాధ ఒకటేనా? ఒకదాని కోసం ఇచ్చిన హామీలు మరొకదాని విషయంలో వర్తిస్తాయా? నా సమాధానం అవును. జీవితమంతా, దేవుని మహిమ కోసం మరియు ఇతరుల రక్షణ కోసం విశ్వాసంతో శ్రద్ధగా జీవించినట్లయితే, ఏదో ఒక రకమైన అడ్డంకులను మరియు శ్రమలను ఎదుర్కుంటాము.
విధేయుడైన క్రైస్తవుడికి వచ్చే శ్రమ, దేవుని విధేయత పిలుపుకు తగినట్టుగా జీవించడంలో ఒక భాగం.
దేవుడు నిర్దేశించిన మార్గంలో క్రీస్తును అనుసరించాలని నిర్ణయించుకున్నప్పుడు, ఈ మార్గంలో ఆయన సార్వభౌమ సమకూర్పులో ఉన్నవాటన్నింటిని మనం ఎంచుకున్నట్లే. ఈ విధంగా, విధేయత యొక్క మార్గంలో వచ్చే అన్ని శ్రమలు క్రీస్తుతో మరియు క్రీస్తు కోసం పడే శ్రమలే – ఇది ఇంట్లో క్యాన్సర్ అయినా లేదా బయట నుండి వచ్చే హింస అయినా.
ఒకసారి మనము “ఎన్నుకున్నాం” – అంటే, మనకు శ్రమలు వచ్చే చోట మనం విధేయత మార్గాన్ని ఇష్టపూర్వకంగా ఎంచుకుంటున్నాం మరియు మనం దేవునికి వ్యతిరేకంగా సణుక్కోము. బాధలు తొలగిపోవాలని పౌలు చేసినట్లు మనము ప్రార్థించవచ్చు. . . (2 కొరింథీయులు 12:8); కానీ దేవుని చిత్తమైతే, పరలోకానికి వెళ్ళే ప్రయాణంలో విధేయత మార్గంలో చెల్లించాల్సిన శిష్యత్వపు వెలలో భాగంగా మనము అన్నింటినీ స్వీకరిస్తాము.
క్రైస్తవ విధేయత అనుభవాలలో హింస లేదా అనారోగ్యం లేదా ప్రమాదం అన్ని వాస్తవాలే: అవన్నీ దేవుని మంచితనంపై ఉన్న మన విశ్వాసానికి ప్రమాదాలు మరియు విధేయత మార్గాన్ని విడిచిపెట్టమని మనల్ని ప్రలోభపెడతాయి.
కాబట్టి, ప్రతి విశ్వాస విజయం మరియు విధేయతలో ఉన్న పట్టుదల, దేవుని మంచితనానికి మరియు క్రీస్తు అమూల్యతకు సాక్ష్యాలు – శత్రువు అనేది అనారోగ్యమైన, సాతానైనా, పాపమైనా లేదా నాశనమైనా ఇంక ఏదైనా సరే. కాబట్టి, మన క్రైస్తవ పిలుపులో మనం భరించే ప్రతి విధమైన బాధ “క్రీస్తుతో” మరియు “క్రీస్తు కోసం” పడే బాధే.
“క్రీస్తుతో” అంటే అర్ధం ఏమిటంటే విశ్వాసంతో మనం ఆయనతో పాటు నడిచేటప్పుడు శ్రమలు వస్తాయి అని అర్థం, మరియు ఆయన తన ప్రధాన యాజక పరిచర్య ద్వారా సానుభూతితో మనకు అందించే బలంతో ఆ శ్రమలను సహిస్తాము అని అర్ధం (హెబ్రీ 4:15).
మరియు “క్రీస్తు కోసం” అంటే శ్రమలు, ఆయన మంచితనం మరియు బలం విషయాలలో మన విధేయతను పరీక్షిస్తాయి మరియు రుజువు చేస్తాయి అని అర్ధం మరియు “క్రీస్తు కోసం” అంటే పూర్తిగా చాలిన పరిహారంగా మరియు బహుమానముగా ఆయన విలువను వెల్లడిచేస్తుంది.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web