నీడలు మరియు నీటి ప్రవాహాలు

నీడలు మరియు నీటి ప్రవాహాలు

షేర్ చెయ్యండి:

“యెహోవా మహిమ నిత్యముండునుగాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించును గాక. ఆయన భూమిని చూడగా అది వణకును ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును! నా జీవితకాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను; నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక నేను యెహోవాయందు సంతోషించెదను”. (కీర్తన 104:31-34).

సృష్టి కార్యాలలో దేవుడు సంతోషిస్తాడు, ఎందుకంటే మనలను అవి వాటిని మించి దేవుని వైపుకు చూపిస్తాయి.

దేవుడు అంటే మనం ఆయన సృష్టి కార్యాన్ని చూసి నిర్ఘాంతపోవడం మరియు ఆశ్చర్యపోవడం జరుగుతాయి. కానీ సృష్టి ప్రయోజనాల కోసం కాదు. ఆయన సృష్టిని చూసి మనం ఇలా చెప్పమని ఆయన ఉద్దేశ్యం: ఆయన చేతి పనే (కేవలం నీ చేతిపనియైన! కీర్తన 8:3) జ్ఞానంతో, శక్తితో, గొప్పతనంతో, మహిమతో మరియు అందంతో నిండి ఉంటే, ఈ దేవుడు ఎలాంటి వాడు!

ఒక అద్దం గుండా చూసినట్లుగా ఇవి ఆయన వైభవం యొక్క వెనుకభాగం మాత్రమే. సృష్టికర్త యొక్క మహిమను స్వయంగా చూస్తే ఎలా ఉంటుంది! ఆయన కార్యాలు కాదు! ఒక బిలియన్ గెలాక్సీలు మానవ ఆత్మను సంతృప్తిపరచవు. దేవుడు మరియు దేవుడు మాత్రమే ఆత్మ యొక్క ముగింపు.

జోనాథన్ ఎడ్వర్డ్స్ ఈ విధంగా వ్యక్తపరిచాడు:

దేవున్ని ఆస్వాదించే ప్రక్రియ మాత్రమే మన ఆత్మలు సంతృప్తి చెందగల ఏకైక ఆనందం. ఈ లోకంలో అత్యంత ఆహ్లాదకరమైన వసతి కంటే పరలోకానికి వెళ్లడం, దేవున్ని పూర్తిగా ఆస్వాదించడమనేది అనంతమైన గొప్ప విషయం. [ఇవి] ఛాయలు మాత్రమే; కాని దేవుడు అసలైనవాడు. ఇవి చెల్లాచెదురుగా ఉన్న కిరణాలు; కాని దేవుడు సూర్యుడు. ఇవి ప్రవాహాలు మాత్రమే; కాని దేవుడు మహాసముద్రం.

అందుకే 104వ కీర్తన 31-34 వాక్యాలలో దృష్టి దేవునిపైనే ఉంది. “నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. . . నేను యెహోవాయందు సంతోషించెదను.” అంతిమంగా మన హృదయాలను ఆశ్చర్యంతో నింపి మన నోటిని శాశ్వతమైన స్తుతులతో నింపేవి సముద్రాలు లేదా పర్వతాలు లేదా లోయలు లేదా నీటి సాలెపురుగులు లేదా మేఘాలు లేదా గొప్ప గెలాక్సీలు కాదు. అది దేవుడు మాత్రమే చేయగలడు.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...