ఇతరులకు సేవ చేయడం ద్వారా వారికి సేవ చేయబడింది
“యేసు అది యెరిగి మనయొద్ద రొట్టెలు లేవేయని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారైయున్నారా?“(మార్కు 8:17)
5,000 మందికి మరియు 4,000 మందికి కొన్ని రొట్టెలు, కొన్ని చేపలతో యేసు ఆహారం పంచిపెట్టిన తరువాత, శిష్యులు తమకోసం సరిపడే ఆహారం తీసుకోకుండా ఆ చిన్న పడవ ఎక్కారు. ఆ పరిస్థితి గురించి వారు చర్చిస్తున్నప్పుడు, “మనయొద్ద రొట్టెలు లేవేయని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? వివేచింపలేదా?” (మార్కు 8:17) అని యేసు చెప్పాడు.
వారు ఏమి గ్రహించలేకపోయారు? ఇతరులను వారు బాగా చూసుకుంటే, యేసు వారిని బాగా చూసుకుంటాడనే విషయాన్ని వారు గ్రహించలేకపోయారు.మిగిలిపోయిన చేపలు మరియు రొట్టెలు ఇదే అర్థాన్ని సూచిస్తున్నాయి. అందుకే యేసు ఈ విధంగా చెప్తున్నాడు, “నేను ఆ అయిదువేలమందికి అయిదు రొట్టెలు విరిచి పంచిపెట్టి నప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపలనిండ ఎత్తితిరని వారి నడిగెను. వారు–పండ్రెండని ఆయనతో చెప్పిరి. ఆ నాలుగు వేలమందికి ఏడు రొట్టెలు నేను విరిచి, పంచి పెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపలనిండ ఎత్తితిరని ఆయన అడుగగా వారు – ఏడనిరి. అందుకాయన – మీరింకను గ్రహింపకున్నారా? అని అనెను.” (మార్కు 8:19-21).
వారు దేనిని గ్రహించాలి? మిగిలిపోయినవాటి విషయం గ్రహించాలి. మిగిలిపోయినవన్నీ సేవ చేసినవారికే (లేక ఆహారాన్ని వడ్డించినవారికి). వాస్తవానికి, మొదటిసారి ఆహారాన్ని పంచి పెట్టినవారు పన్నెండు మంది, మిగిలిపోయిన గంపలు పన్నెండు (మార్కు 6:43), అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గంప అన్నమాట. రెండవసారి, ఏడు గంపలు మిగిలిపోయాయి, అంటే ఏడు అనేది సమృద్ధి సంపూర్ణతకు సంఖ్యగా అర్థం చేసుకోవచ్చు.
వారు ఏమి గ్రహించలేకపోయారు? యేసు వారిని బాగా చూసుకుంటాడనే (సంరక్షిస్తాడనే) విషయాన్ని వారు గ్రహించలేకపోయారు. మీరు యేసు కంటే ఎక్కువ ఇవ్వలేరు; ఆయన దాతృత్వము సాటిలేనిది. ఇతరుల కోసం మీ జీవితాన్ని వెచ్చించినప్పుడు, మీ అవసరతలు తీర్చబడతాయి. “కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును” (ఫిలిప్పీ 4:19).
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web