“ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి”. (ఎఫెసీ 4:32)
రక్షించే విశ్వాసం అనేది మీరు క్షమించబడ్డారనే విషయాన్ని నమ్మడం మాత్రమే కాకుండా పాపం యొక్క ఘోర స్థితిని చూస్తుంది, ఆ తర్వాత దేవుని పరిశుద్ధతను చూస్తుంది, దేవుని క్షమాపణ వివరించలేనంత మహిమాన్వితమైనదని, అందమైనదని ఆధ్యాత్మికంగా భావించబడుతుంది. దానిని మనం స్వీకరించడం మాత్రమే కాకుండా, మనం దానిని ఆరాధిస్తాం. క్షమించేటువంటి గొప్ప దేవునితో మనకున్న క్రొత్త స్నేహాన్నిబట్టి మనం తృప్తి కలిగియుంటాం.
దేవుని క్షమాపణను విశ్వసించడమనేది హమ్మయ్య నాకిక ఎటువంటి భారము లేదని ఒప్పించబడటం మాత్రమే గాకుండా ఈ విశ్వంలో క్షమించే దేవుడు అత్యంత విలువైన వాస్తవమనే సత్యాన్ని ఆస్వాదించడమని కూడా అర్థం. రక్షించే విశ్వాసం దేవుని ద్వారా క్షమించబడుటలో ఆనందిస్తుంది. అక్కడ నుండే క్షమించే దేవునిలోను, ఆయన యేసులో మన కోసం ఏమై ఉన్నాడనే దానిలోను ఆనందించడం ఆరంభమవుతుంది. ఈ అనుభవం క్షమించే వ్యక్తులముగా మనపైన విపరీతమైన ప్రభావాన్ని చూపుతుంది.
మన క్షమాపణను కొనుగోలు చేసే గొప్ప చర్య ఏంటంటే గతంలో క్రీస్తు సిలువే. గతంలో జరిగిన ఈ సిలువ వైపు వెనుదిరిగి చూడటం ద్వారా మనం స్థిరమైన కృప గురించి నేర్చుకుంటాము (రోమా 5:2). మనం ఇప్పుడు, ఎల్లప్పుడూ ప్రేమించబడ్డామని అంగీకరించబడ్డామని నేర్చుకుంటాము. సజీవుడైన దేవుడు క్షమించే దేవుడని మన౦ నేర్చుకు౦టా౦.
అయితే మనం క్షమాపణను అనుభవించే గొప్ప చర్య భవిష్యత్తులో ఎప్పటికీ కొనసాగుతూ ఉంటుంది. క్షమించే గొప్ప దేవునితో మనకున్న ఆనందకరమైన సహవాసం ఎల్లప్పుడూ నిలిచే ఉంటుంది. కాబట్టి, క్షమించే దేవునితో ఈ స౦తృప్తికరమైన సహవాస౦ ను౦డి ప్రవహించే క్షమాపణ కొరకైన స్వాతంత్ర్యం మనమున్న౦త కాల౦ ఉ౦టు౦ది.
మీరు సిలువ వైపు తిరిగి చూసి, మీరు బాధ్యతను చేపట్టుట నుండి దూరంగా ఉండడమే మీ విశ్వాసమైనట్లయితే పగలు, కక్షలు కలిగియుండుటకు సాధ్యమేనని నేను నేర్చుకున్నాను. నేను బాధ్యత నుండి దూరమయ్యానని ఉపశమనం పొందడానికి మాత్రమే కాదు గాని యేసులో నా కోసం దేవుడున్నాడని అన్నిటిలో గాఢమైన సంతృప్తిని కలిగియుండటానికి నేను నిజమైన విశ్వాసం అంటే ఎంటో అని తెలుసుకోవడానికి మరి లోతుల్లోనికి వెళ్ళుటకు బలవంతం చేయబడ్డాను. మనం బాధ్యత నుండి దూరమయ్యామని తెలుసుకోవడానికి మాత్రమే ఈ విశ్వాసం వెనక్కి తిరిగి చూడదు గాని ఆయనతో సహవాస౦లో మనకు అంతులేని సమాధానపరచబడిన రేపటి భవిష్యత్తును ప్రసాది౦చే ఒక అద్భుతమైన దేవుణ్ణి చూడడానికీ, ఆస్వాదించడానికి కూడా ఈ విశ్వాసం వెనుదిరిగే విధంగా చేస్తుంది. అలా౦టి క్షమి౦చే దేవునితో స౦తృప్తికరమైన సహవాస౦ కలిగి ఉండడమనేది మనలాంటి క్షమించే ప్రజల కోసం చాలా ప్రాముఖ్య౦.