రక్షించే విశ్వాసము సులభంగా సంతృప్తి చెందదు
“వారు ఏదేశమునుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొన్నయెడల మరల వెళ్లుటకు వారికి వీలు కలిగియుండును.అయితే వారు మరి శ్రేష్ఠమైన దేశమును, అనగా పరలోకసంబంధమైన దేశమును కోరుచున్నారు”. (హెబ్రీ 11:15-16)
విశ్వాసం దేవుడు ఇచ్చే వాగ్దాన భవిష్యత్తును చూస్తుంది మరియు దానిని “కోరుకుంటుంది”. “అయితే వారు మరిశ్రేష్ఠమైన దేశమును, అనగా పరలోకసంబంధమైన దేశమును కోరుచున్నారు.” దీన్ని గూర్చి కొంతసేపు ఆలోచించండి.
ఒక వ్యక్తి కోరికలలో మార్పు అనేది లేకుండా కేవలము ఒక నిర్ణయం తీసుకోవడమే రక్షించే విశ్వాసం అని చెప్పేవారు దానిని నీరుగార్చే వారుగా ఉన్నారు. అయితే బైబిల్‌లోని గొప్ప విశ్వాస అధ్యాయం – హెబ్రీయులు 11లోని ఈ వచనం యొక్క సారాంశం ఏమిటంటే, విశ్వాసం ద్వారా జీవించడం మరియు చనిపోవడం అంటే కొత్త కోరికలను కలిగి ఉండటం మరియు కొత్త సంతృప్తిని వెంటాడడం.
14వ వచనం ప్రకారం, పాత నిబంధన పరిశుద్ధులు (హెబ్రీయులు 11లో వీరి విశ్వాసం ప్రశంసించబడింది) ఈ లోకం అందించిన దానికంటే మరిశ్రేష్ఠమైన దేశమును కోరుచున్నారు. 16వ వచనంలో వారు ప్రస్తుత భూసంబంధమైన జీవితం అందించే దానికంటే మెరుగైన దానిని కోరుతున్నారని చెప్పారు. “వారు మరిశ్రేష్ఠమైన దేశమును, అనగా పరలోకసంబంధమైన దేశమును కోరుచున్నారు.”
వారు దేవునితో ఉండుట కంటే మరే తృప్తి లేదు కాబట్టి దేవుని చేత బంధించబడ్డారు.
కాబట్టి, ఇదే నిజమైన రక్షించే విశ్వాసం: దూరం నుండి దేవుని వాగ్ధానాలను చూడటం వలన వ్యక్తిగత విలువలలో మార్పును అనుభవించారు తద్వారా మీరు ప్రపంచం అందించే వాటి కంటే ఎక్కువగా దేవుని వాగ్ధానాలను కోరుకుంటారు, వాటిని వెంటపడి వెతుకుతారు మరియు వాటి యందు విశ్వసిస్తారు.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web