“క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలినకాలము ఇకమీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనునట్లు పాపముతో జోలి యిక నేమియులేక యుండును”. (1 పేతురు 4:1-2)
మొదట ఇది తికమక పరుస్తుంది. క్రీస్తు పాపం చేయకుండా ఆపాల్సి వచ్చిందా? లేదు! “ఆయన ఏ పాపము చేయలేదు” (1 పేతురు 2:22).
ఇప్పుడిది అర్థవంతంగా ఉంది. మన కోసం క్రీస్తు శ్రమపడ్డాడనే ఆలోచనతో మనల్ని మనం ధరించుకున్నట్లయితే, ఆయనతోపాటు మనం చనిపోయామని మనం తెలుసుకుంటాం. “మనము పాపముల విషయమై చనిపోయి, నీతి విషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను” (1 పేతురు 2:24). ఆయనతోపాటు మనం చనిపోయినప్పుడు, మనం పాపం చేయకుండా మానేస్తాం.
ఇది రోమా 6వ అధ్యాయమువలె ఉంది. “ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు, మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడ సిలువవేయబడెనని యెరుగుదుము. చనిపోయినవాడు పాపవిముక్తుడని తీర్పుపొందియున్నాడు. అటువలె మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తుయేసునందు సజీవులుగాను మిమ్మును మీరే యెంచుకొనుడి” (రోమా 6:6-7, 11).
“ఈ మనస్సును (ఆలోచనను) మీరును ధరించుకోండి!” అని పౌలు చెప్తున్నాడు.
“పాపము విషయమై మృతులుగా ఎంచుకోండి!” అని పౌలు చెప్తున్నాడు.
పాపానికి విరుద్ధంగా మనం చేసే పోరాటం కొరకు ఉండే సాధనం ఏంటంటే ఈ మనస్సును (ఆలోచనను) ధరించుకోవడమే.
మోహించాలని, దొంగలించాలని, అబద్ధం చెప్పాలని, దోచుకోవాలని, అసూయ చూపాలని, ప్రతీకారం తీర్చుకోవాలని, కించపరచాలాని, భయపడాలని, ఇంకా మొదలగు సాతాను శోధనలు వచ్చినప్పుడు, నన్ను పాపం నుండి విడిపించడానికి నా ప్రభువు శ్రమపొంది, చనిపోయినప్పుడు, నేను పాపం విషయమై చనిపోయాను! అనేటువంటి ఆలోచనను (మనస్సును) మనం ధరించుకోవాలి.
మోహపు సుఖాలకు నిన్ను నీవు తిరస్కరించుకోవడం ఎందుకు? ఎందుకు ఈ సమస్యతో పోరాడుతున్నావు, నీవు అబద్ధం చెప్తే, దానిని నుండి తప్పించుకోవచ్చు కదా? నీవు కోరుకున్న విలాసవంతమైన సుఖ సౌఖ్యాలను ఎందుకు పొందుకోకూడదు? మీరు పొందుకున్న అదే బాధను వారికి తిరిగి ఇవ్వడం ద్వారా న్యాయం చేయాలని ఎందుకు అనుకోకూడదు? అని సాతాను మీకు చెప్పినప్పుడు, వానితో ఈ జవాబు చెప్పండి:
నేను పాపం చేయుట నుండి విడిపించడానికి దేవుని కుమారుడు ఎంతగానో శ్రమ పొందాడు (నిజంగా శ్రమపొందాడు). నన్ను అధ్వాన్నమైన స్థితిలోనికి తీసుకు వెళ్ళడానికి ఆయన శ్రమ పొందాడని నేను నమ్మజాలను. అందుచేత, ఆయన దేన్నైతే కొనాలని చనిపోయాడో అది పాపపు సుఖాలకంటే మరి ఎక్కువ అద్భుతంగా ఉండాలి. నేను క్రీస్తును నమ్ముతున్నందున, నీ ఆకర్షణలకు ప్రభావితం చెందే తత్త్వం పూర్తిగా చనిపోయింది.
సాతాను, నా దగ్గర నుండి వెళ్లిపో! నీ మిఠాయి కొట్టు ముందు నేను నడుస్తూ వెళ్తున్నప్పుడు ఇక ఎన్నటికి నా నోరు జొల్లు కారదు.
Wow, very easy and best illustration of Devil’s marketing strategies to Believers.
thank you.