సమస్తానికి పాలకుడు

సమస్తానికి పాలకుడు

షేర్ చెయ్యండి:

“చీట్లు ఒడిలో వేయబడును వాటివలని తీర్పు యెహోవా వశము”. (సామెతలు 16:33)

ఆధునిక భాషలో మనం ఇలా అంటాము, “టేబుల్‌పై పాచిక వేయబడింది మరియు ప్రతి ఆటను దేవుడు నిర్ణయిస్తాడు.”

మరో మాటలో చెప్పాలంటే, ఆయన తన ప్రయోజనాల కోసం పాలించని చిన్న సంఘటనలు అంటూ ఏవి లేవు. “రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి” అని యేసు చెప్పాడు (మత్తయి 10:29-30).

లాస్ వెగాస్‌లోని ప్రతి పాచిక, వెయ్యి అడవుల్లో చచ్చి పడిపోతున్న ప్రతి చిన్న పక్షి – ఇవన్నీ దేవుని ఆజ్ఞ వలననే.

యోనా పుస్తకంలో, దేవుడు ఒక మనిషిని మింగమని చేపకు ఆజ్ఞాపించాడు (1:17), ఆయన నీడ కోసం ఒక మొక్కను పెంచమని ఆజ్ఞాపించాడు (4:6), మరియు దానిని చంపమని ఒక పురుగును ఆజ్ఞాపించాడు (4:7).

చేపలు, పురుగులకు మించినవి అయిన నక్షత్రాలు కూడా దేవుని ఆజ్ఞ ప్రకారమే వాటి స్థానంలో ఉంటాయి మరియు గట్టిగా వాటి స్థానమును పట్టుకుంటాయి.

“మీకన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలు దేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచువాడే గదా. తన అధికశక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు”. (యెషయా 40:26)

ఈ ప్రపంచంలోని సహజ సంఘటనలు – వాతావరణం, విపత్తులు, వ్యాధులు, వైకల్యం, మరణం కూడా దేవుని ఆజ్ఞను బట్టే జరుగుతాయి.

చట్టాన్ని ఆయన అమలు చేస్తాడు;
వాటి వాటి కక్ష్యలలో నక్షత్రాలు
మరియు సూర్యుడు దాని కక్ష్యలో విధేయతతో ప్రకాశిస్తాడు;
కొండలు మరియు పర్వతాలు,
నదులు మరియు జలపాతాలు,
సముద్రపు లోతులు
ఆయనను దైవంగా ప్రకటిస్తున్నాయి.
(“లెట్ ఆల్ థింగ్స్ నౌ లివింగ్,” కేథరీన్ డేవిస్)

కాబట్టి ఏ సహజ సంఘటన కూడా దేవుని యొక్క తెలివైన, మంచి ఉద్దేశాలకు మరియు ఆయన పరిపూర్ణ నియంత్రణకు బయట లేదని తెలుసుకుని మనం సంభ్రమాశ్చర్యాలతో నిండుకొని సమాధానముతో ఉందాం.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...