ఇక్కడ అవమానం అక్కడ బహుమానం

ఇక్కడ అవమానం అక్కడ బహుమానం

షేర్ చెయ్యండి:

“అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును”. (కీర్తన 1:3)

కీర్తన 1:3 లోని వాగ్దానం క్రీస్తుని ఎలా సూచిస్తుంది?

“అతడు చేయునదంతయు సఫలమగును.” అని చెప్తున్నాడు. నీతిమంతులు చేయునదంతయు సఫలమగును. ఇది అమాయకత్వంతో చెప్పిన విషయమా లేదా లోతైన సత్యమా?

ఈ లోకంలో, దుర్మార్గులు అభివృద్ధి చెందుతారు అనేది వాస్తవం. “తన మార్గమున వర్థిల్లువాని చూచి వ్యసన పడకుము దురాలోచనలు నెరవేర్చుకొనువాని చూచి వ్యసన పడకుము (కీర్తన 37:7). “గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు .. మీరు చెప్పు కొనుచున్నారు.” (మలాకీ 3:15)

నీతిమంతులకు ఈ లోకంలో తరచుగా శ్రమలు, వారి మంచితనానికి ప్రతిగా దూషణలు వస్తాయి అనేది వాస్తవం. “మా దేవుని నామమును మేము మరచియున్నయెడల…  దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా?… నిన్నుబట్టి దినమెల్ల మేము వధింపబడుచున్నాము వధకు సిద్ధమైన గొఱ్ఱెలమని మేము ఎంచబడు చున్నాము” (కీర్తన 44:20-22). కీర్తనల రచయితలకు ఈ విషయం తెలుసు. వారికి ఇదివరకే తెలియని విషయాన్ని గూర్చి మనము అభ్యంతరం తెలియజేయటం లేదు.

కాబట్టి, కీర్తనాకారుడు, “అతడు చేయునదంతయు సఫలమగును.” అని చెప్పినప్పుడు అతడు అమాయకత్వంతో చెప్పడం లేదు. అతడు ఈ జీవితంలోని అస్పష్టతలలో నుండి మరణం తర్వాత ఉండే జీవితాన్ని చూస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ మనం చేసిన క్రియలన్నిటి యొక్క నిజమైన ప్రభావం, నిజమైన ఆశీర్వాదం అక్కడ కనిపిస్తాయి.

పౌలు కూడా ఇలానే ఆలోచించినట్లు మనం చూస్తాము.

మొదట, మరణము మీద క్రీస్తు సాధించిన విజయమును గూర్చి ఆనందిస్తున్నాడు. “ఓ మరణమా, నీ విజయమెక్కడ?… మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక.” (1 కొరింథీ 15:55, 57)

తరువాత, ఈ విజయం కారణంగా, విశ్వాసులు చేసిన ప్రతి పని వర్ధిల్లుతుందనే అంతరార్థాన్ని అతడు వివరించాడు. “కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని” (1 కొరింథీ 15:58). వ్యర్ధం కానిది అంటే వర్ధిల్లుతుంది అని అర్ధం.

యేసు మన స్థానంలో మరణించినందున, ప్రతి మంచి పని త్వరలో లేదా తరువాతో వర్ధిల్లుతుందని హామీ ఇచ్చాడు. “మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభువువలన (పొందుతారు)” (ఎఫెసీ 6:8). “జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకు నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును.” (మత్తయి 5:11-12). ఇక్కడ అవమానం అక్కడ బహుమానం.

పాత నిబంధనలో అమాయకత్వంతో చెప్పినదిగా కనిపించే (“అతడు చేయునదంతయు సఫలమగును”) ఈ మాట, క్రీస్తు యొక్క పనిని మరియు పునరుత్థానం యొక్క వాస్తవికతను లోతుగా సూచిస్తుంది. అదే సత్యం కాథరినా వాన్ ష్లెగెల్ రచించిన “బి స్టిల్ మై సోల్” అనే ఆ గొప్ప పాటలో చూడొచ్చు, “నిశ్చలంగా ఉండుము, నా ఆత్మ: తన సంపూర్ణతలో నుండి ఆయన ప్రతిదానిని తిరిగి చెల్లించగలడు అని రాయబడింది.”

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...