అహంకార క్రియలు, దీన విశ్వాసం

షేర్ చెయ్యండి:

“ఆ దినమందు అనేకులు నన్ను చూచి – ‘ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?’ అని చెప్పుదురు”. (మత్తయి 7:22) 

“క్రియలకు” సంబంధించిన హృదయానికి మరియు “విశ్వాస” సంబంధమైన హృదయానికి మధ్యనున్న వ్యత్యాసాన్ని గమనించండి.

క్రియలకు సంబంధించిన హృదయం తన శక్తితో ఏదైనా సాధించాలనే అహంభావంతో చేసే పని నుండి తృప్తి పొందుకుంటుంది. ఇది ఒక నిలువు రాతి ముఖాన్ని అధిరోహించడానికి ప్రయత్నిస్తుంది, లేదా పనిలో అదనపు బాధ్యతలను తీసుకుంటుంది, లేదా యుద్ధ ప్రాంతంలో జీవితాన్ని ఫణంగా పెడుతుంది, లేదా మారథాన్ ద్వారా బాధపడుతుంది లేదా వారాల పాటు మతపరమైన ఉపవాసం చేస్తుంది, వీటన్నిటిని తన స్వంత సంకల్పం మరియు దాని స్వంత శరీరం యొక్క ప్రోద్బలం ద్వారా వచ్చే సవాలును జయించేటువంటి సంతృప్తి కోసం జరిగిస్తుంది.

క్రియల దృక్పథంతో కూడిన హృదయం మరొక దిశలో కూడా వెళ్లి, మంచితనం, మర్యాద మరియు నైతికత అనేవాటికి విరుద్ధంగా తిరుగుబాటు చేయుట ద్వారా తనదైన స్వతంత్ర ప్రేమను, స్వీయ నిర్దేశమును, స్వీయ సాధనను వ్యక్తపరచవచ్చు (గలతీ 5:19-21). అయితే, అది అనైతికత కలిగియున్నా లేక అనైతిక ప్రవర్తన విరుద్ధమైన పోరాటాన్ని కలిగియున్నా అది స్వీయ నిర్ణయాత్మక, స్వీయ ఉత్తేజపరిచే క్రియలు, నేపథ్యమూ అయ్యున్నది. సాధారణ లక్షణం ఏంటంటే స్వీయ దిశ, స్వీయ నమ్మకం మరియు స్వయం-ఉత్కృష్టత. వీటన్నిటిలోనూ, క్రియల దృక్పథానికి సంబంధించిన ప్రాథమిక సంతృప్తి అనేది దృఢమైన, స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యక్తిగా ఉండటాన్ని ఆస్వాదించడంలో, సాధ్యమైతే స్వయాన్ని గొప్పగా చెప్పుకోవడంలో ఉంటుంది.

విశ్వాసం యొక్క హృదయం పూర్తిగా భిన్నమైనది. భవిష్యత్తుకు సంబంధించి దానికున్న ఆశలు తక్కువేమీ కాదు. అయితే అది ఆశించేదంతా యేసులో మన కోసం ఉన్నటువంటి దేవుణ్ణి అనుభవించే సంపూర్ణ తృప్తిని కలిగియుండడమే.

“క్రియలు” అనేవి ఒక అవరోధాన్ని అధిగమించిన తృప్తిని కోరుకుంటే, “విశ్వాసం” అనేది దేవుడు ఒక అవరోధాన్ని అధిగమించాడనే తృప్తిని ఆస్వాదిస్తుంది. సమర్థుడిగా, దృఢంగా, తెలివితేటలు కలిగిన వాడుగా కీర్తించబడే ఆనందం కోసం క్రియలు ఆరాటపడతాయి. తనకున్న సామర్థ్యం, బలం, జ్ఞానం, కృపల కోసం దేవుడు మహిమ పొందాలనే ఆనందం కోసం విశ్వాసం ఆరాటపడుతుంది.

మతపరమైన రూపంలో, క్రియలు నైతికతకు సంబంధించిన సవాలును స్వీకరించి, గొప్ప ప్రయత్నంతో కూడిన కృషి ద్వారా దానికి సంబంధించిన అడ్డంకులను అధిగమించి, దేవుడు ఆమోదించనందుకు ప్రతిఫలంగాను చెల్లింపుగాను దేవునికి విజయాన్ని అందిస్తుంది. విశ్వాస౦ కూడా నైతికత యొక్క సవాలును స్వీకరిస్తుంది కాని దేవుని శక్తికి సాధనంగా మారిన ఒక స౦దర్భ౦గా ఉంటుంది. విజయం వరించినప్పుడు, సమస్త మహిమలు మరియు కృతజ్ఞతలు దేవునికి మాత్రమే చెందుతాయని విశ్వాసం ఆనందిస్తుంది. 

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...