వర్తమాన మరియు శక్తివంతమైన ప్రేమ

వర్తమాన మరియు శక్తివంతమైన ప్రేమ

షేర్ చెయ్యండి:

“క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా?” (రోమా 8:35)

రోమా 8:35లో మూడు విషయాలను గమనించండి.

1. ఇప్పటికీ క్రీస్తు మనలను ప్రేమిస్తున్నాడు.

చనిపోయిన తన భర్తను గురించి భార్య, ఆయన ప్రేమ నుండి నన్నేది విడదీయలేదు అని చెప్పవచ్చు. అంటే, అతని ప్రేమకు సంబంధించిన జ్ఞాపకాలు తన జీవితమంతా మధురంగా ఉంటాయని ఆమె అనుకోవచ్చు. అయితే,ఇక్కడ ఆ జ్ఞాపకాల గురించి పై వచనంలో పౌలు గారు చెప్పడంలేదు.

రోమా 8:34 వచనం, “శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే; అంతే కాదు, మృతులలోనుండి లేచినవాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే” అని స్పష్టంగా చెబుతోంది. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏదీ ఎడబాపదని పౌలు చెప్పడానికిగల కారణం ఏంటంటే క్రీస్తు సజీవంగా ఉన్నాడు మరియు ఆయన ఇప్పటికీ మనల్ని ప్రేమిస్తున్నాడు.

ఆయన దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు కాబట్టి ఆయన మన కోసం పాలన చేస్తున్నాడు. ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు, అంటే ఆయన సంపూర్ణముగా చేసి ముగించిన విమోచనా కార్యం వాస్తవానికి మనల్ని గంటగంటకు రక్షించి, నిత్యత్వపు ఆనందానికి ఎంతో భద్రంగా తీసుకు వస్తున్నాడు. ఆయన ప్రేమ కేవలం జ్ఞాపకం మాత్రమే కాదు గాని సర్వశక్తిమంతుడైన, సజీవుడైన దేవుని కుమారుడు మనల్ని నిత్వత్వపు ఆనందానికి తీసుకువచ్చే క్షణక్షణం జరిగించే కార్యం.

2. ఈ క్రీస్తు ప్రేమ విడదీయుట నుండి మనల్ని రక్షించడంలో ఎంతో ప్రభావపూరితంగా ఉంటుంది కాబట్టి ఇది అందరి కోసం చూపించబడే సార్వత్రిక ప్రేమ కాదు గాని రోమా 8:28 వచనం ప్రకారం దేవుని ప్రజలకు, అంటే దేవుని ప్రేమించువారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడినవారికి ప్రత్యేకమైన ప్రేమయైయున్నది.

ఈ ప్రేమను గురించే, “పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తు కూడ సంఘమును ప్రేమించి,…. దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను” అని ఎఫెసీ 5:25వ వచనం చెప్తోంది. ఇది తన వధువైన సంఘం కోసం కలిగియున్న క్రీస్తు ప్రేమ. క్రీస్తు అందరి కోసం ప్రేమను కలిగియున్నాడు మరియు ఆయన తన వధువుపట్ల ఒక ప్రత్యేకమైన, రక్షించే, భద్రపరిచే ప్రేమను కలిగియున్నాడు. మీరు క్రీస్తును నమ్మినట్లయితే మీరు కూడా ఆ వధువు సంఘంలో భాగమై ఉన్నారని మీకు తెలుస్తుంది. ఎటువంటి మినహాయింపులు లేకుండా, రోమా 8:35 ప్రకారంగా క్రీస్తును విశ్వసించే వారెవ్వరైనా, నేను ఆయన వధువులో, ఆయన సంఘంలో, ఆయన పిలిచి ఎన్నుకున్నవారిలో, ఏదిఏమైనా శాశ్వతంగా భద్రపరచబడినవారిలో భాగమై ఉన్నానని చెప్పవచ్చు.

3. ఎంతో ప్రభావితమైన ఈ సర్వశక్తుని రక్షించే ప్రేమ, ఈ జీవితంలో ఎదురయ్యే విపత్తుల నుండి మనల్ని కాపాడదు గాని, వాటి గుండా మనల్ని దేవునితో నిత్యత్వపు ఆనందాన్ని అనుభవించేందుకు ఎంతో భద్రంగా తీసుకువస్తుంది.

మరణం మనకు సంభవిస్తుంది గాని అది మనల్ని విడదీయదు. అందుచేత, 35వ వచనంలో “ఖడ్గమైనను” క్రీస్తు ప్రేమ నుండి మనల్ని విడదీయదని పౌలు చెప్పినప్పుడు, ఆయన ఉద్దేశం ఏంటంటే మనము చంపబడినను, మనము క్రీస్తు ప్రేమ నుండి వేరు కాము అని చెప్తున్నాడు.

అందుచేత, 35వ వచనం యొక్క సారాంశం ఏంటంటే యేసు క్రీస్తు తనకున్న సర్వ శక్తి అంతటితో తన ప్రజలను ఎంతో హెచ్చుగా ఇప్పటికీ ప్రేమిస్తున్నాడు, మనము ఎదుర్కునే ఉపద్రవాల నుండి క్షణ క్షణం రక్షించకపోయినా, శ్రమలు మరియు మరణం ద్వారా ఆయన సన్నిధిలో నిత్యత్వపు ఆనందం కోసం మనల్ని భద్రపరచి ఉన్నాడు.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...