“నా ప్రాణమా, నీవేల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేనాయనను స్తుతించెదను”. (కీర్తన 42:11)
నిరాశా నిస్పృహలతో, అంటే కృంగిపోయిన ప్రాణముతో పోరాడటం మనం నేర్చుకోవాలి. పోరాటం అంటే భవిష్యత్తు కృపపై విశ్వాసంతో చేసే పోరాటమే. దేవుని గురి౦చి, ఆయన వాగ్దాన౦ చేసిన భవిష్యత్తు గురి౦చి మనకు మనమే సత్యాన్ని బోధించుకోవడం ద్వారా అది పోరాడుతు౦ది.
దీనినే కీర్తనాకారుడు కీర్తన 42లో చేస్తున్నాడు. కీర్తనాకారుడు కృంగిపోయిన తన ప్రాణానికి బోధిస్తున్నాడు. కీర్తనాకారుడు తనను తాను మందలించుకుంటూ, తనతో తాను వాదించుకుంటున్నాడు. ఇక్కడ అతని ప్రధాన వాదనంతా భవిష్యత్తు కృప గురించే ఉంది. “దేవునిలో నిరీక్షణ కలిగియుండడం! భవిష్యత్తులో మీ కోసం దేవుడు ఏమైయున్నాడనే దానిలో నమ్మకం ఉంచండి. స్తోత్రించే రోజు రాబోతుంది. మీకు అవసరమైన ప్రతి సహాయాన్ని దేవుని సన్నిధి తీరుస్తుంది. ఎల్లప్పుడు మనతోనే ఉంటాడని ఆయన మనకి మాటిచ్చాడు.”
ఆధ్యాత్మిక నిరాశ నిస్పృహలను జయించడంలో దేవుని భవిష్యత్తు కృప గురించి మనకు మనం సత్యాన్ని బోధించుకునే ఈ విషయం చాలా ముఖ్యమైనదని మార్టిన్ లాయిడ్-జోన్స్ గారు నమ్ముతారు. ఆయన వ్రాసిన స్పిరిచ్యువల్ డిప్రెషన్ (Spiritual Depression) అనే ఉపయోగకరమైన పుస్తకంలో ఆయన ఇలా వ్రాశాడు, మీ జీవితంలో మీ అసంతృప్తికి కారణం మీరు మీతో మాట్లాడటానికి బదులుగా మీ మాటలను మీరే వింటుంటారని మీరు గ్రహించారా? ఉదయం నిద్రలేవగానే మీకు వచ్చే ఆలోచనలను తీసుకోండి. మీరు వాటిని పుట్టించలేదు గాని అవి మీతో మాట్లాడటం ప్రారంభిస్తాయి, అవి నిన్నటి సమస్యలను వెనక్కి తీసుకువస్తాయి, మొదలగునవి చేస్తాయి. ఎవరో మాట్లాడుతున్నారు. . . మీ ఆత్మ మీతో మాట్లాడుతోంది. ఇప్పుడు ఈ వ్యక్తి (కీర్తన 42లో) వ్యవహరించిన తీరు ఇలా ఉంది: ప్రాణం (అంతరంగం) తనతో మాట్లాడటానికి అనుమతించడానికి బదులుగా, ఆయన తనతో తాను మాట్లాడుకోవడం ప్రారంభించాడు. “నా ప్రాణమా, నీవేల క్రుంగియున్నావు?” అని అడుగుతున్నాడు. అతని ప్రాణం (అంతరంగం) అతణ్ణి నిరాశపరుస్తూ, అతణ్ణి నలగగొడుతోంది. అతను లేచి నిలబడి, “ప్రాణమా, ఒక్క క్షణం విను. నీతో మాట్లాడతాను” అన్నాడు. (20–21)
నిరాశ నిస్పృహలకు వ్యతిరేకంగా చేసే యుద్ధం దేవుని వాగ్దానాలను విశ్వసించడానికి చేసే యుద్ధమైయున్నది. ఆ మాట వినడం ద్వారానే దేవుని భవిష్యత్తు కృపపై నమ్మకాన్ని కలిగిస్తుంది. అందుచేత, దేవుని వాక్యాన్ని మనకు మనమే బోధించుకోవడం అనేది పోరాటానికి కేంద్రమైయున్నది.