ప్రార్థనకు ఆశ్చర్యార్థక చిహ్నం!

షేర్ చెయ్యండి:

“దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయనవలన నిశ్చయములైయున్నవి”. (2 కొరింథీ 1:20)

ప్రార్థన అంటే వాగ్దానాలకు స్పందనయైయున్నది, అంటే దేవుని భవిష్యత్తు కృపకు హామీలుకు స్పందనయైయున్నది.

ప్రార్థన అంటే భవిష్యత్ కృపకు సంబంధించి దేవుడు తన నిల్వలన్నీ జమచేసిన ఖాతాలో నుండి మనకు అవసరమైనది బయటకు తెచ్చుకోవడం.

ప్రార్థన అనేది మంచి ఉద్దేశాలను కలిగియున్న దేవుడు చీకట్లో ఉంటాడని నిరీక్షణ కలిగించేది కాదు. ప్రార్థన అనేది దేవుని వాగ్దానం మీద ఆధారపడి ఉంటుంది. అది ప్రతి రోజు బ్యాంకు దగ్గరకు వెళ్తుంది, భవిష్యత్తుకు సంబంధించిన కృప యొక్క నిల్వల నుండి ఆ రోజుకు అవసరమైన ప్రతిదానిని బయటకు తెస్తుంది.

ఈ గొప్ప వచనంలో ఉన్నటువంటి రెండు భాగాల మధ్యనున్న సంబంధాన్ని బాగా గమనించండి. “గనుక” అనే పదాన్ని గమనించండి: “దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి గనుక (అందుచేత) మనద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములైయున్నవి.

దీన్ని మనం గమనిస్తున్నామని నిశ్చయించుకొని, ఇప్పుడు మనం రెండు భాగాలను చూద్దాం: మనం ప్రార్థన చేసినప్పుడు, క్రీస్తు ద్వారా మనం దేవునికి ఆమేన్ అని చెప్తాం, ఎందుకంటే క్రీస్తునందున్న వాగ్దానాలన్నిటికి దేవుడే నిర్ణయాత్మకంగా ఆమేన్ అని చెప్పాడు. క్రీస్తు కోసం, భవిష్యత్ కృపకు సంబంధించిన ఆయన వాగ్దానాలను దేవుడే నెరవేర్చాలని నిశ్చయంగా విన్నవించుకోవడమునే ప్రార్థన అని అంటారు. అన్నింటికీ పునాదియైన యేసు క్రీస్తుతో భవిష్యత్తు కృపలో మనం పెట్టుకున్న విశ్వాసాన్ని కలుపుతుంది ప్రార్థన.

ప్రార్థన సమయాలలో సంపూర్ణమైన, శ్రేష్టమైన పదమైన “ఆమేన్” అనేది చివరి అంశానికి దారి తీస్తుంది. ఆమెన్ అనే ఈ పదానికి ప్రాథమిక అర్థం, ‘నేను ఈ ప్రార్థన చేశాను’ అని చెప్పడం కాదు గాని, వాస్తవానికి, “దేవుడే ఈ వాగ్దానాలన్నిటిని చేశాడు” అని నొక్కి చెప్పడం.

ఆమేన్ అంటే “అవును ప్రభువా, మీరు దీనిని చేయగలరుఅని అర్థం. ఈ పదానికి, “అవును ప్రభువా, నీవు శక్తిమంతుడవు. ఆవును ప్రభువా, నీవు జ్ఞానివి. అవును ప్రభువా, నీవు కనికరముగలవాడవు. అవును ప్రభువా, సమస్త భవిష్యత్ కృప మొత్తం మీ నుండి వస్తోంది, క్రీస్తులో ధృవీకరించబడింది” అని అర్థం.

“ఆమేన్” అంటే నిరీక్షణకు బలమైన ఆమోదానికి ముగింపుగా పెట్టే ఆశ్చర్యార్థక చిహ్నం మరియు సహాయం కోసం ప్రార్థించిన తర్వాత నిశ్చయత అనే భరోసాను ఇవ్వడం.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...