పాపుల కోసం ప్రార్థన
“మాకును ప్రార్థనచేయ నేర్పుమని ఆయన నడిగెను”. (లూకా 11:1)
దేవుడు పరిపూర్ణ వ్యక్తుల ప్రార్థనలకు కాదు పాపుల ప్రార్థనలకు సమాధానం ఇస్తాడు! ఈ సత్యాన్ని మీరు సిలువను చూస్తూ గ్రహించకపోతే ప్రార్థన విషయంలో మీరు పూర్తిగా స్తంభించిపోతారు.
ఎవరైతే పాపాల మూలంగా ఇబ్బందులు పడుతూ విముక్తి కోసం ఏడుస్తున్నారో దేవుడు ఆ పాపాత్ముల మొరను వినే అనేక వాక్యాలను పాత నిబంధన గ్రంథం నుండి నేను చూపించగలను. (ఉదాహరణకు, కీర్తన 38:4, 15; 40:12– 13; 107:11–13). లూకా 11 నుండి ఈ అంశాన్ని రెండు విధాలుగా చూపిస్తాను:
ప్రభువు ఇక్కడ నేర్పించిన ప్రార్థనలో (లూకా 11:2-4), యేసు ఇలా చెప్పాడు, “మీరు ప్రార్థన చేయునప్పుడు. . . ” ఆపై 4వ వచనంలో అతను ఈ మొరను చేర్చాడు “మా పాపములను క్షమించుము”. కాబట్టి, మీరు ప్రార్థన ప్రారంభ అంశమును మధ్య దానితో కలిపితే, ఆయన చెప్పేది ఏమిటంటే, “మీరు ప్రార్థన చేయునప్పుడు … మా పాపములను క్షమించుము.” అని చెప్పమంటున్నాడు.
“నీ నామము పరిశుద్ధపరచబడును గాక” అనేది మన ప్రార్థనలన్నింటిలో ఎలా అయితే ప్రాముఖ్యమైన భాగమో అలాగే అది కూడా అంతే ప్రాముఖ్యం అని నేను అర్ధం చేసుకున్నాను. అంటే యేసు మనం ప్రార్థన చేసే ప్రతిసారీ వాస్తవంగా క్షమాపణ కోరాలని ఆశిస్తున్నాడు.
మరో మాటలో చెప్పాలంటే, మనం ఎల్లప్పుడూ పాపులమే. మనం చేసేది ఏదీ పరిపూర్ణమైనది కాదు. మార్టిన్ లూథర్ మరణశయ్యపై చెప్పినట్లుగా, “మనము బిచ్చగాళ్లం. ఇది నిజం.” మనం ప్రార్థించే ముందు కొంత విధేయతను సాధించినప్పటికీ, ప్రతి ఒక్కరం ఎల్లప్పుడూ పాపులుగా ప్రభువు వద్దకు వస్తాము. మరియు పాపులు ఇలా ప్రార్థించినప్పుడు దేవుడు వారి ప్రార్థనలను తిప్పికొట్టడు.
రెండవదిగా లూకా 11:12-13లో మనం దీనిని చూడగలం: “కాబట్టి మీరు చెడ్డవారైయుండియు, మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను!”
యేసు తన శిష్యులను “చెడ్డవారు” అని పిలిచాడు. ఇది చాలా బలమైన పదజాలం. వారు అతని సహవాసానికి దూరంగా ఉన్నారని తన అర్థం కాదు. వారి ప్రార్థనలకు సమాధానం లభించదని ఆయన ఉద్దేశ్యం కాదు.
ఈ పతనమైన యుగంలో మనం ఉన్నంత కాలం, తన స్వంత శిష్యులు కూడా వారు చేసే ప్రతి పనిని కలుషితం చేసే చెడును కలిగి ఉంటారని, కానీ వారు ఆయన కృపపై మరియు శక్తిపై ఆధారపడటం వలన ఎక్కువ మేలు చేయకుండా అవేవీ వారిని నిరోధించలేదు.
మనం ఏకకాలంలో చెడ్డవారము మరియు విమోచింపబడినవారము. పరిశుద్ధాత్మ శక్తితో మన చెడును క్రమక్రమంగా జయిస్తున్నాము. కానీ మనం మారుమనస్సు పొందడం ద్వారా మనలో ఉన్న అవినీతి నిర్మూలం కాలేదు.
మనం పాపులం, మనం బిచ్చగాళ్ళం. మనం మనలో ఉన్న ఈ పాపాన్ని గుర్తించి, దానిని త్యజించి, దానితో పోరాడి, మన నిరీక్షణయైన క్రీస్తు సిలువను అంటిపెట్టుకొని ఉంటే, అప్పుడు దేవుడు మన మనవులను విని మన ప్రార్థనలకు జవాబిస్తాడు.

జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Powered By ABNY Web