ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించుట
“మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టినవారందరును లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు?” (1 యోహాను 5:3-5)
తిరిగి జన్మించడం అంటే దేవుని మూలముగా పుట్టడం. దేవుని ఆజ్ఞలను భారమైనవిగా కాకుండా మనం ఆనందించే ఆజ్ఞలుగా చేయడం అనేది ఈ వచనాలలో స్పష్టంగా తెలియపరచబడియున్నది. ఇది ఎలా పని చేస్తుంది?
దేవుని మూలముగా పుట్టినవారు దేవుని ఆజ్ఞలను భారముగా కాకుండా ఆనందంగా ఎలా ఎంచుకుంటారు?
“దేవుని మూలముగా పుట్టినవారందరును లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే” (1 యోహాను 5:4) అని అపొస్తలుడైన యోహాను చెప్తున్నారు. మరొక విధంగా చెప్పాలంటే, దేవుని మూలముగా పుట్టినవారు విశ్వాసము ద్వారానే దేవుని ఆజ్ఞలకు సంబంధించిన లోకానుసారమైన భారాన్ని జయిస్తారు. “యేసే క్రీస్తయి యున్నాడని నమ్ము ప్రతివాడును దేవునిమూలముగా పుట్టియున్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును” అని అక్షరార్థంగా చెప్పబడినటువంటి 1 యోహాను 5:1 వచనంలో ఈ విషయం ధృవీకరించబడింది.
మనం దేవుని మూలముగా పుట్టామనడానికి విశ్వాసమే ఆధారం. నమ్మాలని నిర్ణయించుకోవడం ద్వారా మనంతట మనమే తిరిగి జన్మించలేము. దేవుడు మనల్ని తిరిగి జన్మించే విధంగా చేయడం ద్వారా నమ్మేందుకు ఆయనే మనలో ఇష్టాన్ని సృష్టిస్తాడు. “జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింప జేసెను” (1 పేతురు 1:3) అని పేతురు తన మొదటి పత్రికలో చెప్పాడు. జీవముతో కూడిన నిరీక్షణ, లేక భవిష్యత్ కృపలోని విశ్వాసం అంటే క్రొత్త జన్మ ద్వారా దేవుని కార్యం జరుగుతుంది.
అందుచేత, “దేవుని మూలముగా పుట్టినవారందరును లోకమును జయించుదురు;…” అని యోహాను చెప్పినప్పుడు, “లోకమును జయించిన విజయము మన విశ్వాసమే” (1 యోహాను 5:4) అని ఆ మాటలకు జోడించి చెప్తున్నాడు, అంటే క్రొత్తగా జన్మించడం ద్వారా లోకాన్ని జయించడానికి, దేవుని ఆజ్ఞలను పాటించడానికి మనకుండే లోకపరమైన కోరికను జయించడానికి దేవుడు మనల్ని బలపరుస్తాడని యోహాను చెప్తున్నట్లుగా నేను భావిస్తున్నాను. క్రొత్తగా జన్మించినప్పుడు విశ్వాసాన్ని సృష్టించడం ద్వారా ఈ కార్యం జరుగుతుంది, తద్వారా క్రొత్తగా జన్మించిన వ్యక్తి దేవుని ఆజ్ఞలను భారంగా భావించకుండా, దేవుని ఆజ్ఞలనుబట్టి ఆనందించే స్వభావమును కలిగి ఉంటాడు.
కాబట్టి, దేవునిపట్ల, ఆయన చిత్తం పట్ల మనకు పుట్టుకతోనే వచ్చిన శతృత్వాన్ని విశ్వాసమే జయిస్తుంది, ఆయన ఆజ్ఞలను పాటించడానికి మరియు “నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము” (కీర్తనలు 40:8) అని కీర్తనాకారుడు చెప్పినట్లుగా మనం చెప్పడానికి మనల్ని స్వతంత్రులనుగా చేస్తుంది.

జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Powered By ABNY Web