స్తుతించడంలో ఆనందించు

స్తుతించడంలో ఆనందించు

షేర్ చెయ్యండి:

“దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరు నిన్ను స్తుతించుదురు గాక”. (కీర్తన 67:3, 5)

మనం దేవున్ని స్తుతించాలని దేవుడు ఎందుకు కోరుతున్నాడు?

సి.ఎస్. లూయిస్:

మనుష్యులు తాము దేనికి విలువనిస్తారో దానిని స్వేచ్ఛగా ప్రశంసించినట్లే, వారు స్వేచ్ఛగా దానిని ప్రశంసించడంలో తమతో చేరమని మనలను ప్రోత్సహిస్తారు: “ఆమె మనోహరమైనది కాదా? అది మహిమాన్వితమైనది కాదా? అది అద్భుతంగా అనిపించలేదా?”

మనుషులందరూ శ్రద్ధ వహించే దాని గురించి మాట్లాడేటప్పుడు వారు ఏమి చేస్తారో దేవున్ని స్తుతించమని ప్రతి ఒక్కరికీ చెప్పడంలో కీర్తనాకారులు అదే చేస్తున్నారు. దేవుని స్తుతించడం కష్టంగా ఉండటమనేది, అత్యున్నతమైన విలువైన మనం సంతోషించే నిజానికి మనం ఏవైతే చేయకుండా ఉండలేమో అనేదానికి మరియు మనం విలువైన ప్రతిదానిని అసంబద్ధంగా తిరస్కరించే స్వబావంపై ఆధారపడి ఉంటుంది.

స్తుతులు కేవలం వ్యక్తీకరించడమే కాకుండా మన ఆనందాన్ని పూర్తి చేస్తాయి కాబట్టి మనం ఆనందించేవాటిని స్తుతించడంలో మనం సంతోషిస్తాం. ఇదే దానిని నియమించడంలో ఉన్న అంతిమ ఉద్ధేశ్యం. ప్రేమికులు తాము ఎంత అందంగా ఉన్నారో ఒకరినొకరు చెప్పుకుంటూ ఉండటం పొగడ్తలు కాదు; ఆనందాన్ని వ్యక్తపరిచే వరకు  అది అసంపూర్ణమైనది.

సమాధానం ఉంది — దేవుని స్తుతించమని మనలను ఆజ్ఞాపించడంలో దేవుని అహంకారముగా అనిపించే దానికి పరిష్కారం! ఇది మన గొప్ప ఆనందమును అడగటం లాంటిది. మనం ఆనందించేవాటిని స్తుతిస్తాము ఎందుకంటే అది స్తుతులతో వ్యక్తీకరించబడే వరకు ఆనందం అసంపూర్ణంగా ఉంటుంది. మనం విలువైన వాటి గురించి మాట్లాడటానికి మరియు మనం ఇష్టపడే వాటిని జరుపుకోవడానికి మరియు మనం మెచ్చుకున్న వాటిని ప్రశంసించడానికి అనుమతించకపోతే, మన ఆనందం పరిపూర్ణమవ్వదు.

కాబట్టి, మన సంతోషాన్ని సంపూర్ణం చేసేంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తే, ఆయన మనకు తనను తాను ఇవ్వడం మాత్రమే కాదుగానీ ఆయన మన నుండి మన హృదయాల స్తుతులను కూడా అంగీకరించాలి – ఆయన బలపడడానికో  లేదా లోపాన్ని భర్తీ చేయడం కోసమో కాదు, కానీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నందున మన ఆనందాన్ని ఆయన కోరుకుంటున్నాడు. అత్యంత అద్భుతమైనవానిని తెలుసుకోవడం మరియు ఆరాధించడం ద్వారా మాత్రమే ఆ ఆనందము కనుగొనగలము.

ఆయన నిజంగా మన పక్షాన ఉంటే, ఆయన తన కోసం ఉండాలి! సమస్త విశ్వంలో దేవుడు విషయంలో మాత్రమే తన స్వంత ప్రశంసలను కోరుకోవడం అంతిమంగా ప్రేమపూర్వక చర్య. ఆయనకి తనను తాను గొప్ప చేసుకోవడం  అత్యున్నత ధర్మం. ఆయన “దేవుని మహిమకు కీర్తి కలుగుటకై” (ఎఫెసీయులు 1:12, 14) అన్నిటిని చేసినప్పుడు, ప్రపంచమంతటలో మన కోరికలను తీర్చగల ఏకైక దానిని ఆయన మన కొరకు సంరక్షించి మనకు అందజేస్తాడు.దేవుడు మన పక్షాన ఉన్నాడు! మరియు ఈ ప్రేమకు పునాది ఏమిటంటే, నిన్ననేడు నిరంతరం దేవుడు తన కోసమే ఉన్నాడు.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...