
డా. శంకర్ బాబు
డా. శంకర్ బాబు గారు వృత్తిరీత్యా వైద్యులు మరియు హైదరాబాద్ తెలుగు బైబిల్ చర్చ్ సంఘ కాపరిగా పరిచర్య చేస్తున్నారు.
రచయితగా, కవిగా ఎన్నో రచనలు చేశారు. వాక్యానుసారమైన సువార్త అక్షయునికి అక్షరార్చన అనే పుస్తకాలను రాశారు. ఆయన తన భార్య మేరీ మరియు ఆలిత్య ఆవియ ఆబ్డియేల్ అనే ముగ్గురు పిల్లలతో హైదరాబాద్ లో నివాసముంటున్నారు.
రచయితగా, కవిగా ఎన్నో రచనలు చేశారు. వాక్యానుసారమైన సువార్త అక్షయునికి అక్షరార్చన అనే పుస్తకాలను రాశారు. ఆయన తన భార్య మేరీ మరియు ఆలిత్య ఆవియ ఆబ్డియేల్ అనే ముగ్గురు పిల్లలతో హైదరాబాద్ లో నివాసముంటున్నారు.

సి. స్టీఫెన్ డేవిడ్
సి. స్టీఫెన్ డేవిడ్, ఎక్లేషియా ఎవాంజెలికల్ ఫెలోషిప్ కాపరిగా పరిచర్య చేస్తున్నారు. స్టీఫెన్ డేవిడ్, ఆరోగ్యకరమైన సంఘ సభ్యుల యొక్క 10 లక్షణాలు, కాస్ట్ ఆఫ్ మ్యారేజ్, క్రీస్తు, కులం మరియు సంఘం, ఆథెంటిక్ క్రిస్టియన్ అనే పుస్తకాలను రాశారు. స్టీఫెన్ తన భార్య చైతన్య, వారి ఇద్దరు కుమారులు జాయ్ & జో లతో కలిసి హైదరాబాద్ లో నివసిస్తున్నాడు.

బెంజమిన్
బెంజమిన్, కరీంనగర్ సమీపంలోని ఒక గ్రామంలో రెండు దశాబ్దాలకు పైగా మిషనరీగా పనిచేసి ప్రస్తుతం, వివిధ ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తూ, సెమినార్లలో ప్రసంగిస్తూ పరిచర్య చేస్తున్నారు. ఎక్లేసియా ఎవాంజెలికల్ ఫెలోషిప్ లో సభ్యుడుగా ఉన్నారు. బెంజమిన్ తన భార్య రూతుతో కలిసి హైదరాబాద్ లో నివసిస్తున్నారు. దేవుడు వీరికి ఒక కుమారుడు అర్జున్ మరియు కుమార్తె రాచెల్ ను దయచేశారు.

రాజేష్
రాజేష్, సజీవ సాక్షుల సమాజం అనే సంఘానికి సంఘ కాపరిగా భాద్యతలు నిర్వహిస్తున్నారు. తన జీవిత భాగస్వామి వినోలియా, పిల్లలు హాన్సెల్ రాజ్ మరియు జేడెన్ రాజ్ హైదరాబాద్ నగరంలో నివసిస్తున్నారు.





