“దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చెదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను?” (కీర్తన 42:1-2)
ప్రధానంగా, అతను ప్రమాదకరమైన పరిస్థితుల నుండి ఉపశమనం కోసం తృష్ణగొని లేడు అనే విషయం ఈ వాక్యమును చాలా అందంగా మరియు చాలా కీలకమైనదిగా చేస్తుంది. అతను ప్రధానంగా తన శత్రువుల నుండి తప్పించుకోవడానికి లేదా వారి నాశనం కోసం దాహంగా లేడు.
ఉపశమనం కోరుకోవడం, దాని కోసం ప్రార్థించడం తప్పు కాదు. శత్రువుల ఓటమి కోసం ప్రార్థన చేయడం కొన్నిసార్లు సరైనది. కానీ వాటన్నింటికంటే ముఖ్యమైనది దేవుడే.
కీర్తనలలో ఉన్న దేవునితో కలిసి మనం ఆలోచించినప్పుడు మరియు అనుభూతి చెందినప్పుడు, ఇది ప్రధాన ఫలితం: మనం దేవుణ్ణి ప్రేమిస్తాము, మనం దేవుణ్ణి చూడాలని, దేవునితో ఉండాలని మరియు దేవుని మెచ్చుకొని ఆయనను ఆనందించడంలో సంతృప్తి చెందాలని కోరుకుంటున్నాము.
2వ వచనం ముగింపు వాక్యాన్ని ఈ విధంగా అనువదించవచ్చు, “నేను ఎప్పుడు వచ్చి దేవుని ముఖాన్ని చూస్తాను?” ఆ ప్రశ్నకు సమాధానం యోహాను 14:9 మరియు 2 కొరింథీయులు 4:4లో ఇవ్వబడింది. “నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు” అని యేసు చెప్పాడు. మరియు మనం క్రీస్తును విశ్వసించినప్పుడు “దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము” చూస్తామని పౌలు చెప్పాడు.
మనం క్రీస్తు ముఖాన్ని చూసినప్పుడు, మనం దేవుని ముఖాన్ని చూస్తాము. మరియు, పౌలు 2 కొరింథీయులకు 4: 4 మరియు 6 లో ఆయన మరణం మరియు పునరుత్థానం యొక్క సువార్త కథను విన్నప్పుడు మనము క్రీస్తు మహిమను చూస్తాము అని చెప్పాడు. అతను దానిని “దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త” అని పిలుస్తున్నాడు. లేదా (6వ వచనం): “తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు” అని అంటున్నాడు.
దేవుడు మీ ఆకలిని మరియు దేవుని ముఖాన్ని చూడాలనే మీ దాహాన్ని పెంచును గాక. మరియు దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ద్వారా ఇప్పుడు కూడా ఆయన మీ కోరికను తీర్చును గాక.



