“అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను, తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు”. (ఆపొ. కార్య 20:24)

క్రొత్త నిబంధన ప్రకార౦, క్రైస్తవులందరూ చేసేదే “సేవ (పరిచర్య)”. ఎఫెసీ 4:11-12 ప్రకారం, సేవ కోసం పరిశుద్దులను సంసిద్ధం చేసే పని పాస్టర్లకు ఉంది. కానీ సాధారణ క్రైస్తవులందరూ పరిచర్య చేస్తారు.

క్రైస్తవులు ఎంత విభిన్నంగా ఉంటారో పరిచర్య కూడా అంతే విభిన్నంగా ఉంటుంది. ఇది సంఘ పెద్ద లేక పరిచారకుడులాంటి కర్తవ్యంవంటిది కాదు; ఇది క్రీస్తును ఎక్కువగా సంపాదించుకోవడానికి మరియు ఇతరుల అవసరాలను తీర్చడానికి అంకితమైన ఒక జీవనశైలి.

దాని అర్థమేమిట౦టే మన౦ “మనకు సమయము దొరకినకొలది అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు చేయుదము” (గలతీ 6:10). ఈ మాటకు, మన౦ బ్యాంకర్లైనా, ఇటుకల తయారీదారులైనా, ఇతరుల విశ్వాసాన్ని, పరిశుద్ధతను దేవుని మహిమకరంగా చేయడమే మన లక్ష్యమని అర్థం.

జీవం కలిగి ఉండుటకంటే మీ పరిచర్యను నెరవేర్చడం చాలా ప్రాముఖ్యం. ఈ నమ్మకమే సమూల నిబద్ధత కలిగిన వ్యక్తుల జీవితాలను చూడటానికి చాలా స్ఫూర్తిదాయకంగా చేస్తుంది. “అయితే దేవుని కృపాసువార్తనుగూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసువలన పొందిన పరిచర్యను, తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు” అని వారిలో చాలామ౦ది అపొ. కార్య 20:24లో పౌలు తన పరిచర్య గురి౦చి చెప్పినట్లే మాట్లాడతారు. దేవుడు మనకు ఇచ్చిన పరిచర్యను చేయడమనేది ప్రాణంకంటే ఎంతో ప్రాముఖ్యమైనది.

మీ పరిచర్యను చేసే క్రమంలో మీరు మీ ప్రాణాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మీరు అనుకోవచ్చు. అలా అనుకోవడానికి బదులుగా, మీరు మీ జీవితాన్ని ఎలా కోల్పోతారనేది మీ పరిచర్యకు మూలస్తంభ౦ కావచ్చు. ఇలాంటిది యేసుకు ముప్ఫై ఏళ్లు ఉన్నప్పుడు ఆయన జీవితంలో మాత్రమే జరిగింది.

మన పరిచర్యను (సేవను) ముగించు క్రమంలో మనం జీవితాలను కాపాడుకోవడం గురించి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. మన మరణం మన పరిచర్యకు ఆటంకం కాదని, మన పరిచర్యకు అది చివరి చర్య అని ఆయన నిర్ణయిస్తాడు.

“నేను చేసేందుకు ఆయన [దేవుని] దగ్గర నాకు పని ఉన్నట్లయితే, నేను చావను” అని ఎంతో నిజమైన సంగతిని హెన్రీ మార్టిన్ గారు చెప్పాడు. మరో మాటలో చెప్పాలంటే, నా పని పూర్తయ్యే వరకు నేను అక్షయమైన వ్యక్తిని. కాబట్టి, ప్రాణంకంటే పరిచర్య చాలా ప్రాముఖ్యం.

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *