“వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను; ఇదే యెహోవా వాక్కు”. (యిర్మీయా. 1:8)
ప్రభువు సేవ చేయడానికి, ముఖ్యంగా యౌవస్తులుగా సేవ చేయడానికి ఉండేటువంటి గొప్ప ఆటంకం ఏంటంటే తృణీకరణ మరియు వ్యతిరేకత అనే భయాన్ని కలిగియుండడమే.
మనం చేసేటువంటి పరిచర్యను లేక మనం మాట్లాడే విధానాన్ని కొంతమంది ఇష్టపడరేమోనన్న అన్ని రకాల ఆలోచనలు మనస్సులోనికి ప్రవేశిస్తాయి. అయితే ప్రజలు అంగీకరించకపోవచ్చు, లేక సమర్థించుకోవచ్చు. నేను పొరపాటు చేయవచ్చు మరియు విమర్శించబడవచ్చు.
మనిషికి భయపడడం సేవకు అతి పెద్ద ఆటంకం.
అందుచేత, భయపడవద్దు, నేను మీతో ఉన్నాను, నేను మీకు విడుదల కలిగిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. మనుష్యులు ఇచ్చే ప్రశంసలకంటే దేవుని సన్నిధి మరియు దేవుని ఆమోదం చాలా విలువైనవి. మీ సమస్యలన్నిటి మధ్యలో, మీ సమస్యలన్నిటి నుండి నేను మీకు విడుదల కలుగజేస్తానని దేవుడు చెప్తున్నాడు. అంతిమంగా మీరే విజయం పొందుకుంటారు. మీరు ఒక జయశాలికంటే ఎక్కువ బలవంతులుగా ఉంటారు.
ఇది క్రీస్తు యేసునందు మనకందరికి వాగ్దానం చేయబడింది:
- “ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే (దేవుడే) చెప్పెను గదా. కాబట్టి – ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అని మంచి ధైర్యముతో చెప్పగలవారమైయున్నాము”. (హెబ్రీ. 13:5-6)
- “ఇట్లుండగా ఏమందుము? దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధియెవడు?” (రోమా. 8:31)
అందుచేత, దేవుడు యౌవనుడైన యిర్మీయాతో చెప్పాడు మరియు ‘నేను యౌవ్వనుడను’ అని చెప్పవద్దు, లేక నేను వృద్ధాప్యంలో ఉన్నాను, లేక నేను అది, నేను ఇది అని ఏమీ చెప్పవద్దని (యిర్మియా.1:7) ఈ రోజున ఆయన సేవను చేయడానికి ఆయన పిలుచుకున్న యౌవనులందరికి, మిగిలిన మనకందరికి ఆయన చెప్తున్నాడు.
ఎందుకు అలా చెప్పవద్దని అంటున్నాడు?
- ఎందుకంటే మీ జీవితం కదలని, దేవుని సార్వభౌమాధికార ఉద్దేశాలలో స్థిరంగా ఉన్నది. మీరు గొప్ప ఉద్దేశం కోసం ఎన్నుకోబడ్డారు, పవిత్రీకరించబడ్డారు, రూపించబడ్డారు మరియు నియమించబడ్డారు.
- మీ పరిచర్య వెనుక, మీ మాటల వెనుక మీ స్వంత అధికారం లేదు గాని దేవుని అధికారం ఉంది.
- మీకు కలిగే ప్రతి సమస్యలన్నిటిలో మిమ్మల్ని విడిపించడానికి దేవుడే మీకు తోడై ఉంటాడు.