సృష్టి యొక్క సందేశం

సృష్టి యొక్క సందేశం

షేర్ చెయ్యండి:

“తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి”. (రోమా 1:22-23)

ఒక వ్యక్తి తన వధువును ప్రేమించడం కంటే తన పెళ్లి ఉంగరాన్ని ఎక్కువగా ప్రేమిస్తే అది గొప్ప మూర్ఖత్వం మరియు గొప్ప విషాదం. కానీ అలాగే జరిగిందని ఈ వాక్యం సెలవిస్తుంది.

మానవులు సృష్టిలో దేవుని శ్రేష్ఠత యొక్క ప్రతిధ్వనితో ప్రేమలో పడ్డారు మరియు ప్రేమ, బలము మరియు కీర్తి యొక్క సాటిలేని, అసలైన అరుపులను వినగల సామర్థ్యాన్ని కోల్పోయారు.

సృష్టి సందేశం ఇది:

ఈ అద్భుతమైన విశ్వం వెనుక మహిమ, శక్తి మరియు దాతృత్వం కలిగిన గొప్ప దేవుడు ఉన్నాడు; ఆయన మిమ్మల్ని సృష్టించాడు కాబట్టి మీరు ఆయనకి చెందినవారు. ఆయన మీతో సహనంతో ఉన్నాడు కాబట్టి మీ తిరుగుబాటు జీవితాన్ని మీరు కొనసాగించ గలుగుతున్నారు. ఆయనపై మీ నిరీక్షణను ఉంచండి మరియు ఆయనలో మీరు ఆనందించండి, కేవలం ఆయన చేతిపనులే కాదు.

కీర్తన 19:1-2 ప్రకారం, పగలు అనేది మనుష్యుల్ని గుడ్డివాళ్లుగా చేసేంత ప్రకాశవంతమైన సూర్యుడు, నీలి ఆకాశం, మేఘాలు, వివరించలేని ఆకారాలు, రంగులు మరియు కనిపించే అందమైన నిర్మాణాల ద్వారా దేవుని గురించిన “బోధ”ను బోధిస్తుంది. రాత్రి అనేది గొప్ప చీకటి శూన్యాలు, నిండు చంద్రుడు, లెక్కలేనన్ని నక్షత్రాలు, వింత శబ్దాలు, చల్లని గాలులు మరియు లైట్లతో మాట్లాడుతూ మనుష్యులకు దేవుని “జ్ఞానాన్ని” కురిపిస్తూనే ఉంది.

పగలు మరియు రాత్రి ఒక విషయం చెబుతున్నాయి: దేవుడు మహిమాన్వితుడు! దేవుడు మహిమాన్వితుడు! దేవుడు మహిమాన్వితుడు! సృష్టిలో మీకున్న అత్యున్నత సంతృప్తిని దేవుని వైపు తిప్పండి మరియు మహిమాన్విత ప్రభువులో మీరు ఆనందించండి.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...