మిషనరీకి ఔషధం

మిషనరీకి ఔషధం

షేర్ చెయ్యండి:

“దేవునికి సమస్తమును సాధ్యమే”. (మార్కు 10:27)

సార్వభౌమ కృప అనేది క్రైస్తవ హెడోనిస్ట్‌కు జీవపు ఊట. క్రైస్తవ హెడోనిస్ట్ ఎక్కువ ఇష్టపడేది దేవుని సార్వభౌమ కృప తనని నింపడం మరియు ఇతరుల మేలు కోసం పొంగిపొర్లడం.

క్రైస్తవ హెడోనిస్ట్ మిషనరీలు “నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయియున్నాను” (1 కొరింథీ 15:10) అనే అనుభవాన్ని ఇష్టపడతారు. వారి మిషనరీ శ్రమ ఫలం పూర్తిగా దేవునిదే (1 కొరింథీ 3:7; రోమా 11:36) అనే సత్యంలో వారు సేదతీరుతున్నారు.

“నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.” (యోహాను 15:5) అని ప్రభువు చెప్పినప్పుడు వారు ఆ విషయమై సంతోషిస్తారు. కొత్త సృష్టి యొక్క అసాధ్యమైన బరువును దేవుడు వారి భుజాల మీద నుండి తీసివేసి తనపై వేసుకున్నాడనే సత్యమును బట్టి వారు సంతోషంతో గొర్రెపిల్లల్లా దూకుతారు. వారు అసూయ పెట్టుకోకుండా, “మావలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది.” (2 కొరింథీ 3:5) అని చెప్పగలుగుతారు.

వారు సెలవుపై ఇంటికి వచ్చినప్పుడు, సంఘముతో ఇలా చెప్పడం కంటే ఎక్కువ ఆనందాన్ని ఏదీ ఇవ్వదు, “అన్యజనులు విధేయులగునట్లు . . . క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనినిగూర్చియు మాటలాడ తెగింపను. ” (రోమా ​​15:18).”దేవునికి సమస్తమును సాధ్యమే” – అనే ఈ మాటలు భవిష్యత్ విషయంలో నిరీక్షణను ఇస్తాయి, జరిగిపోయిన వాటి విషయంలో అవి వినయాన్ని కలుగజేస్తాయి. అవి నిరాశకు విరుగుడు మరియు అహంకారానికి విరుగుడు – పరిపూర్ణ మిషనరీ ఔషధం.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...