అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును. (యాకోబు 4:7)
సాతాను మన కాలంలో ఎంత వాస్తవముగా కనిపిస్తాడో, ఎంత స్పష్టంగా చురుకుగా కనిపిస్తాడో, క్రీస్తు విజయం ఆయనను విశ్వసించే వారికి అంత విలువైనదిగా మారుతుంది.
క్రీస్తు చనిపోయి తిరిగి లేచినప్పుడు, సాతాను నిశ్చయంగా ఓడిపోయాడని కొత్త నిబంధన బోధిస్తుంది. అతనికి పరిమితమైన స్వేచ్ఛ ఇవ్వబడింది, కానీ దేవుని ప్రజలకు వ్యతిరేకంగా అతని శక్తి విచ్ఛిన్నమైంది, అతని నాశనం నిశ్చయం.
- “అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను.” (1 యోహాను 3:8)
- “కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును,” (హెబ్రీయులు 2:14)
- “ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను.” (కొలొస్సయులు 2:15)
మరో మాటలో చెప్పాలంటే, కల్వరిలో నిర్ణయాత్మక దెబ్బ తగిలింది. ఒక రోజు, సాతాను యొక్క పరిమితమైన స్వేచ్ఛ ముగిసినప్పుడు, ప్రకటన 20:10 ఇలా చెబుతోంది, “అపవాది అగ్ని గంధకములుగల గుండములో పడవేయబడెను. . .యుగయుగములు రాత్రింబగళ్లు బాధింపబడును.”
యేసుక్రీస్తును వెంబడిస్తున్న మనకు దీని అర్థం ఏమిటి?
“కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు.” (రోమా 8:1)
“దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపు వాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే;” (రోమా 8:33)
“మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవున వియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.” (రోమా 8:38–39)
“మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు” (1 యోహాను 4:4)
“వారు గొఱ్ఱెపిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్యమునుబట్టియు వానిని జయించియున్నారు.” (ప్రకటన 12:11)
కాబట్టి, ” అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.” అతను ఓడిపోయాడు, మనకు విజయం ఇవ్వబడింది. ఇప్పుడు మన కర్తవ్యం ఆ విజయంలో జీవించడం, సాతానుకి తన ఓటమిని తెలియజేయడమే.




Word of God Awesome
Great effort
Glory to almighty God