అబ్రహం లింకన్ విషయంలో దేవుని పోషణ
“ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్య ములు; ఆయన మార్గములెంతో అగమ్యములు”. (రోమా 11:33)
1809లో ఈ రోజున జన్మించిన అబ్రహం లింకన్ తన నలభై ఏళ్ల వయస్సులో ఉన్నపుడు మతం విషయంలో సంశయంతో ఉండేవాడు మరియు కొన్నిసార్లు విరక్తిగా కూడా ఉన్నాడు. కాబట్టి, వ్యక్తిగత మరియు జాతీయ సమస్యలు లింకన్‌ను దూరంగా నెట్టడం కంటే దేవుని వాస్తవికతలోకి ఎలా ఆకర్షించాయి అనేది చాలా అద్భుతమైన విషయం.
1862లో, లింకన్‌కు 53 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, అతని 11 ఏళ్ల కుమారుడు విల్లీ మరణించాడు. లింకన్ భార్య “న్యూ ఏజ్ మతమాధ్యమాలను వెతకడం ద్వారా తన దుఃఖాన్ని ఎదుర్కోవటానికి ప్రయత్నించింది.” లింకన్ వాషింగ్టన్‌లోని న్యూయార్క్ అవెన్యూ ప్రెస్బిటేరియన్ చర్చి కాపరి అయిన ఫినియాస్ గుర్లీని ఆశ్రయించాడు.
గుర్లీ మాటలలో చెప్పాలంటే, అనేక సుదీర్ఘ చర్చలు తరువాత లింకన్ “క్రీస్తుని విశ్వసించడం” జరిగింది. “నేను వెళ్ళవలసిన వేరే చోటు ఎక్కడా లేదు అనే అపారమైన నమ్మకం చాలాసార్లు నన్ను మోకాళ్లపై నడిపించింది” అని లింకన్ చెప్పాడు.
అదేవిధంగా, మరణించిన మరియు గాయపడిన సైనికుల భయాందోళనలు ప్రతిరోజూ అతనిపై దాడి చేశాయి. వాషింగ్టన్‌లో క్షతగాత్రుల కోసం యాభై ఆసుపత్రులు ఉన్నాయి. రోటుండా ఆఫ్ ది కాపిటల్ లో గాయపడిన సైనికుల కోసం రెండు వేల మంచాలను ఏర్పాటు చేశారు.
సాధారణంగా, ఈ తాత్కాలిక ఆసుపత్రులలో రోజుకు యాభై మంది సైనికులు మరణిస్తారు. ఇవన్నీ లింకన్‌ను దేవుని పోషణలోకి లోతుగా నడిపించాయి. “ప్రపంచాన్ని సృష్టించినవాడు ఇప్పటికీ దానిని పరిపాలిస్తున్నాడని మనం నమ్మడం తప్ప ఇంకేం చేయలేము.” అని లింకన్ చెప్పేవాడు.
అంతర్యుద్ధానికి సంబంధించి దేవుని పోషణ గురించి అతని హత్యకు ఒక నెల ముందు చేసిన అతని రెండవ ప్రారంభ ప్రసంగంలో అత్యంత ప్రసిద్ధ ప్రకటన చేశాడు. ఆ ప్రసంగంలో తమ యూనియన్ కీ గాని లేదా సమాఖ్యకు గాని దేవుడ్ని మద్దతుదారునిగా చేయకపోవడం విశేషం. దేవుడు తన స్వంత ఉద్దేశాలను కలిగి ఉన్నాడు మరియు ఆయన పాపాన్ని అలా చూసి చూడనట్టు ఉండడు అని లింకన్ వారికి అర్ధమయ్యే ఆ ప్రసంగంలో ఈ విధంగా చెప్పాడు.
ఈ భయంకరమైన యుద్ధ విపత్తు త్వరితగతిన పోవాలని మేము ఆశిస్తున్నాము – మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాము. . . .
ఇంకా అది కొనసాగాలని దేవుడు కోరుకుంటే, గత రెండు వందల సంవత్సరాల అపరిమితమైన శ్రమతో పోగుచేసిన సంపద అంతా మునిగిపోయే వరకు, మరియు కొరడా దెబ్బతో తీయబడిన ప్రతి రక్తపు చుక్కకు జవాబుగా మరొకరి ఖడ్గంతో చెల్లించే వరకు కొనసాగాలి. మూడు వేల సంవత్సరాల క్రితం చెప్పినట్లుగా ఇప్పటికీ చెప్పాలి, “ప్రభువు యొక్క తీర్పులు, పూర్తిగా నిజమైనవి మరియు నీతివంతమైనవి.”
నష్టపోయిన వారిని గూర్చి, గాయపడిన వారిని గూర్చి మరియు గొప్ప దుఃఖంతో బాధపడుతున్న మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. అవన్నీ లింకన్‌ను మేల్కొలిపినట్లు, అంటే నిష్ప్రయోజనమైన అదృష్టము మీద ఆధారపడటానికి కాదు గానీ దేవుని అనంతమైన జ్ఞానం మరియు అంతుచిక్కని ప్రియమైన దేవుని పోషణపై లోతుగా ఆధారపడేలా మిమ్మల్ని మేల్కొలపాలని మీ కోసం నేను ప్రార్థిస్తున్నాను.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web
One comment
Thanks for your message,it is happening to me