క్రిస్మస్‌లో జీవం మరియు మరణం

షేర్ చెయ్యండి:

“దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరిదేనికిని రాడు; గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను”. (యోహాను 10:10)

నేను దీనిని వ్రాయడం ప్రారంభించబోతున్నప్పుడు, మారియన్ న్యూస్ట్రమ్ మరణించినట్లు వార్త వచ్చింది. మా సంఘంలో ఎక్కువమంది సభ్యులు జన్మించకముందే, మారియన్ మరియు ఆమె భర్త ఎల్మెర్ చాలా కాలంగా సంఘంలో భాగస్వాములుగా ఉన్నారు. ఆమె వయస్సు 87. వారికి వివాహమై 64 సంవత్సరాలు.

నేను ఎల్మెర్‌తో మాట్లాడి, అతడు ప్రభువులో బలంగా ఉండాలని మరియు జీవితంపై ఆశను కోల్పోవద్దని చెప్పినప్పుడు, “ఆయన నిజమైన స్నేహితుడు” అని క్రీస్తు గురించి చెప్పాడు. “క్రీస్తు నా నిజమైన స్నేహితుడు” అని క్రైస్తవులందరూ చెప్పగలిగే వారుగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.

ప్రతి క్రిస్మస్ కి నేను నా తల్లి మరణించిన వార్షికోత్సవాన్ని గుర్తు చేసుకుంటాను. ఇశ్రాయేలులో జరిగిన బస్సు ప్రమాదంలో ఆమె తన 56వ ఏట చనిపోయింది. అది డిసెంబర్ 16, 1974. ఆ సంఘటనలు ఈనాటికీ నా కళ్ల ముందు కదలుతున్నాయి. నన్ను నేను అనుమతించినట్లయితే, సులభంగా కన్నీళ్లు పెట్టుకోగలను. ఉదాహరణకు, నా కుమారులు ఆమెను ఎప్పుడూ కలవలేకపోయారు అనే ఆలోచనలు కన్నీళ్లను తెప్పిస్తాయి. మేము క్రిస్మస్ మరుసటి రోజున ఆమెను సమాధి చేసాము. ఎంత విలువైన క్రిస్మస్ ఇది!

ఈ క్రిస్మస్‌లో మీలో చాలామంది మీ కోల్పోయిన వారిని మునుపటి కంటే ఎక్కువగా గుర్తు చేసుకుంటారు. దాన్ని అడ్డుకోకండి. అది రానివ్వండి. అనుభవించండి. జీవమైన మరియు మరణమైన రెండింటిలోనూ – మన ప్రేమను తీవ్రతరం చేయకపోతే ప్రేమ దేనికి? కానీ ద్వేషం వద్దు. ద్వేషం వలన మనల్ని మనమే నాశనం చేసుకున్న వారమవుతాం.

మనం నిత్యజీవం పొందేందుకు అనగా “జీవము కలుగుటకును అది సమృధ్ధిగా కలుగుటకు” (యోహాను 10:10) యేసు వచ్చాడు. ఎల్మర్ మరియు మారియన్ తమ చివరి సంవత్సరాలను ఎక్కడ గడపాలో చర్చించుకున్నారు. ఎల్మెర్ ఇలా అన్నాడు, “మా ఆఖరి ఇల్లు ప్రభువుతో ఉంటుందని మారియన్ మరియు నేను సమ్మతించాము.”

మీరు ఇంటి కోసం తహతహలాడుతున్నారా? నాకు కుటుంబముంది. ఈ సెలవులకి నా కుటుంబం ఇంటికి వస్తోంది. అది ఎంతో సంతోషంగా అనిపిస్తోంది. ఇది సంతోషంగా అనిపించడానికి అసలు కారణం ఏమిటంటే, నేను మరియు వారు ఆత్మల లోతుల్లోకి చూస్తే, మనము పరలోక ఇంటికి వెళ్లిపోవుటకు నియమించబడి ఉన్నాము. ఇతర గృహప్రవేశాలన్నీ ముందస్తు రుచులే. మరియు ముందస్తు రుచులు ప్రత్యామ్నాయంగా మారితే తప్ప అవి మంచివే. చివరి, గొప్ప, అన్నింటిని సంతృప్తిపరిచే మాధుర్యానికి ఈ క్రిస్మస్ సీజన్‌లోని అన్ని మధురమైన విషయాలు ప్రత్యామ్నాయాలుగా మారనివ్వవద్దు. ప్రతి నష్టం మరియు ప్రతి ఆనందం మీ హృదయాలను పరలోకపు ఇంటికి పంపనివ్వండి.

క్రిస్మస్. ఇది తప్ప ఏముంది: వారికి జీవము కలుగుటకు నేను వచ్చాను? మారియన్ న్యూస్ట్రమ్, రూత్ పైపర్, మీరు మరియు నేను — మనం ఇప్పుడు, ఎప్పటికీ జీవితాన్ని కలిగి ఉంటాము.

నిత్యమైన జీవపు ఊట వద్ద తాగడం ద్వారా మీరు ప్రస్తుతము జరుపుకునే ఈ క్రిస్మస్‌ను మరింత ఘనంగా చేసుకోండి మరియు మరింత లోతుగా చేసుకోండి. అది చాలా సమీపంలో ఉంది.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...