ఆస్తులు మరియు బంధువులు పోనివ్వండి

షేర్ చెయ్యండి:

“అయితే మీరు వెలిగింపబడిన మీదట, శ్రమలతోకూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపుదినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే, మీరు నిందలను బాధలను అనుభవించుటచేత పదిమందిలో ఆరడిపడితిరి; మరియొక విధముగా చూచితే, వాటిననుభ వించినవారితో పాలివారలైతిరి. ఏలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి, మీకు మరి శ్రేప్ఠమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని యెరిగి, మీ ఆస్తి కోలుపోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి”. (హెబ్రీ 10:32-35)

హెబ్రీ 10:32-35 వచనాలలోని క్రైస్తవులు గొప్ప వెలగల ప్రేమను గురించి బోధించే హక్కును మనకు సంపాదించి పెట్టారు.

ఇక్కడ పరిస్థితి ఇలా ఉన్నట్లు కనబడుతోంది: వారు మారుమనస్సు పొందిన తొలి రోజుల్లో కొందరు తమ విశ్వాసం కోసం ఖైదు చేయబడ్డారు. మరికొందరు, మన౦ అజ్ఞాతంలోకి వెళ్లి “సురక్షిత౦గా” ఉ౦దామా లేక జైల్లో ఉన్న మన సహోదరీ సహోదరులను కలుసుకుని మన ప్రాణాలను, ఆస్తులను పణంగా పెడదామా? అనే ఒక క్లిష్టమైన ఎంపికను ఎదుర్కొన్నారు. అయితే, వారు ప్రేమ మార్గాన్ని ఎంచుకుని, దానికి కలుగు పర్యవసానాన్ని అంగీకరించారు.

“మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి, మీకు మరి శ్రేప్ఠమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని యెరిగి, మీ ఆస్తి కోలుపోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి”.

అయితే, వారేమైనా పోగుట్టుకున్నారా? లేదు, వారేమీ పోగుట్టుకోలేదు. వారు ఆస్తులను కోల్పోయి, ఆనందాన్ని సంపాదించుకున్నారు! వారికి కలిగిన నష్టాన్ని సంతోషంగా అంగీకరించారు.

ఒక విధంగా చెప్పాలంటే, వారు తమను తాము ఉపేక్షించుకున్నారు (నిరాకరించుకున్నారు). ఇది వాస్తవం మరియు ఎంతో గొప్ప వెలతో కూడుకున్నది. అయితే, మరొక రకంగా చెప్పాలంటే, వారు దేనిని పోగొట్టుకోలేదు. వారు ఆనంద మార్గాన్ని ఎన్నుకున్నారు. మాసిదోనియులవలె (2 కొరి౦థీ 8:1-9) పేదలను ఆదుకోవడానికి ప్రేరేపి౦చబడినట్లే, ఈ క్రైస్తవులు కూడా జైలు పరిచర్య కోసం ప్రేరేపి౦చబడ్డారు. దేవునిపట్ల వారికున్న  ఆనందం ఇతరుల కోసం ప్రేమను చూపడంలో పొంగి పొర్లింది. 

వారు తమ జీవితాలను చూసి, “జీవముకంటే ప్రభువు ప్రేమ ఉత్తమం” (కీర్తన 63:3 చూడండి) అని చెప్పారు.

వారు తమకున్న ఆస్తులను చూసి, “మాకున్న భూ సంబంధమైన ఆస్తులకంటే ఎంతో ఉత్తమమైన ఆస్తులను మరియు చిరకాలం ఉండే ఆస్తులను పరలోకంలో కలిగియున్నాం” (హెబ్రీ 10:34 వచనాన్ని చూడండి) అని చెప్పారు.

ఆ తర్వాత, వారు తమలో ఒకర్నొకరు చూసుకుంటూ, బహుశా మార్టిన్ లూథర్ గారి గొప్ప కీర్తనలాగ ఏదైనా పాడి ఉండవచ్చు:

ఆస్తులు మరియు బంధువులు వెళ్లిపోనివ్వండి
ఈ క్షయ జీవితం కూడా
వారు శరీరాన్ని చంపగలరేమో
దేవుని సత్యము నిలిచే ఉంటుంది
ఆయన రాజ్యం శాశ్వతంగా ఉంటుంది.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...