వివాహం విషయంలో యేసు ఆనందం

షేర్ చెయ్యండి:

పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను. (ఎఫెసీయులు 5:25–27)

దాంపత్యంలో ఇన్ని కష్టాలు రావడానికి కారణం భార్యాభర్తలు తమ ఆనందాన్ని కోరుకోవడం కాదు, తమ జీవిత భాగస్వామి ఆనందంలో వారి ఆనందాన్ని కోరుకోకపోవడమే. మీ జీవిత భాగస్వామి యొక్క ఆనందంలో మీ ఆనందాన్ని వెతకడం భార్యాభర్తలకు బైబిల్ ఇచ్చే ఆదేశం.

ఎఫెసీ 5:25-30లో వివాహం గురించిన వాక్యభాగం కంటే ఎక్కువ హేడోనిస్టిక్ వాక్యభాగం బైబిల్లో ఇంకెక్కడ లేదు. క్రీస్తు తన సంఘమును ప్రేమించిన విధంగానే తమ భార్యలను ప్రేమించాలని భర్తలకు చెప్పబడింది.

ఆయన సంఘమును ఎలా ప్రేమించాడు? 27వ వచనం ఆయన “దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను” అని చెబుతోంది. కానీ ఎందుకు? ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి మరియు “పరిశుద్ధపరచుటకై” అప్పగించుకున్నాడు. అయితే ఆయన అలా ఎందుకు చేయాలనుకున్నాడు? 27వ వచనం, “మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని” సమాధానమిస్తుంది.

“ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించెను” (హెబ్రీయులు 12:2). ఏ ఆనందం? ఆయన వధువు అయిన సంఘమునకు వివాహ ఆనందం. రక్తంతో కొనుక్కున్న వైభవంలో సంఘమును సమర్పించుకున్న ఆనందం.

మురికి గల అపవిత్రమైన భార్యను కలిగి ఉండాలని యేసు ఉద్దేశించలేదు. కాబట్టి, ఆయన తనకు తానే “మహిమగల” భార్యగా సమర్పించుకోవడానికి నిశ్చితార్థమైన తన భార్యను ఉదకస్నానముచేత పవిత్రపరచి మరియు “పరిశుద్ధపరచుటకై” చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తన వధువు యొక్క మంచి కోసం తనను తాను శ్రమలకు అప్పగించుకొని తన హృదయ కోరికను పొందాడు.

28-30 వచనాలలో భర్తలకు దీనిని అన్వయిస్తున్నాడు.  “అటువలెనే పురుషులుకూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై యున్నాము గనుక అలాగే క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు.”

భార్యాభర్తలకు – మరియు అందరికి – “నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు” (మత్తయి 22:39) అని యేసు చెప్పాడు. దీనిని వివాహంలో అన్వయించుకోడానికి సరిగ్గా సరిపోతుంది. ఇది కేవలం నిన్ను నీవు ప్రేమించిన విధంగా అని మాత్రమే కాదు. అయితే దేవుడు నీతో ఏకశరీరముగా చేసిన వ్యక్తిని నీవు ప్రేమించినప్పుడు, నిన్ను నీవు ప్రేమించినట్లే. అంటే, మీ జీవిత భాగస్వామి యొక్క గొప్ప ఆనందాన్ని కోరుకోవడం ద్వారా మీరు మీ గొప్ప ఆనందాన్ని పొందుకుంటారు.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...