“అయితే యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధి కారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగాచేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు. నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను”. (మత్తయి 28:18–20)

మత్తయి యొక్క చివరి అధ్యాయం పునరుత్థాన క్రీస్తు యొక్క సూర్యోదయ మహిమపై తెరుచుకున్న కిటికీ. దీనిద్వారా గొప్ప పర్వతమనే క్రీస్తు నుండి మూడు భారీ శిఖరాలు అనే ఆయన గుణలక్షణాలను చూడవచ్చు: ఆయన బలం; ఆయన దయ; మరియు ఆయన ఉద్దేశ్యం.

సర్వాధికారము ఆయనదే – ఆయనకు నచ్చింది చేసే హక్కు మరియు బలము కలిగియున్నాడు. సమస్త దేశాల నుండి శిష్యులను చేయాలనే తన అచంచలమైన ఉద్దేశ్యాన్ని కొనసాగించడానికి ఆయన ఈ శక్తిని ఉపయోగిస్తాడు. ఈ ప్రక్రియలో ఆయన మనపట్ల వ్యక్తిగతంగా దయగలిగి ఉన్నాడు, యుగసమాప్తి వరకు మనతో ఉన్నానని వాగ్దానం చేశాడు.

పునరుత్థానుడైన క్రీస్తు గొప్పతనాన్ని ఆరాధించాలనే మన కోరికను తీర్చబోతున్నట్లయితే, అది ఆయన చేస్తాడని మనందరికీ తెలుసు. బలములో గొప్పవాడు. దయలో గొప్పవాడు. లక్ష్యసాధనలో గొప్పవాడు.

తమ లక్ష్యాలను నెరవేర్చుకోలేని బలహీనంగా ఉన్న వ్యక్తులు గొప్పతనాన్ని ఆరాధించాలనే మన కోరికను తీర్చలేరు. జీవితంలో ఎలాంటి లక్ష్యం లేని వ్యక్తులను మనం కొంచెం ఆరాధిస్తాం. కేవలం స్వార్థపూరితమైన మరియు దయలేని ఉద్దేశాలు కలిగిన వారిని మనము ఇంకా చాలా తక్కువ ఆరాధిస్తాం.

ఆయన శక్తి అపరిమితమైనదని, ఆయన దయ మృదువైనదని మరియు ఆయన ఉద్దేశ్యం ఒకే ఒక్కటి మరియు స్థిరమైనదని మనం చూడాలని మరియు తెలుసుకోవాలని కోరుకుంటాం.

నవలా రచయితలు మరియు కవులు మరియు చలనచిత్ర నిర్మాతలు మరియు టీవీ రచయితలు అప్పుడప్పుడు ఇటువంటి వ్యక్తిత్వం కలిగిన వాని నీడను సృష్టిస్తారు. అయితే ఈ నెల నేషనల్ జియోగ్రాఫిక్ గ్రాండ్ కాన్యన్ పట్ల నా కోరికను తీర్చగలదేమో గాని ఆరాధించాలనే మన కోరికను వారు తీర్చలేరు.

మన దగ్గర అసలు విషయం ఉండాలి. సమస్త బలము, దయ మరియు ఉద్దేశ్యత యొక్క అసలైన రూపాన్ని మనం తప్పక చూడాలి. మనం పునరుత్థానుడైన క్రీస్తును చూడాలి మరియు ఆరాధించాలి.

Author

  • జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *