ఈ క్షణం కోసమే యేసు మరణించాడు

షేర్ చెయ్యండి:

“నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసమువలన జీవించుచున్నాను.” (గలతీ 2:20)

ఈ ఉదయం 4.59 నిమిషాలకు అలారం మోగినప్పుడు, ఆ క్షణంలో నాకు ఈ ఆలోచన కలిగింది అదేమనగా నేను నిజంగా చనిపోయి, నన్ను మెచ్చుకోవడానికి ఏమీ లేని స్థితిలో పరిశుద్ధుడైన దేవుని ముందు నిలబడినట్లుగా అనిపించింది.

అయితే యేసు క్రీస్తు చనిపోయాడనే సత్యం వలన ఇంత భయంకరమైన ఆలోచనను అవలీలగా జయించగలిగాను.

ఆ తర్వాత ఆ ఆలోచన అది కనుమరుగైపోయింది.

అప్పుడు నాకొచ్చిన తక్షణ ఆలోచన ఏమంటే, ఎవరైనా మారుమనస్సు పొందినప్పుడు కలిగేటువంటి అతి ప్రాముఖ్యమైన ఆలోచన ఇది. యేసు క్రీస్తు నిజమని ఈ విధంగానే తెలుసుకుంటారు. ఒక వ్యక్తి యేసు ప్రేమను ఈ విధంగానే రుచి చూస్తారు. మొట్ట మొదటిసారిగా, ఆకస్మికంగా, అపరాధ భావాన్ని కలిగిన మనస్సాక్షితో తప్పనిసరిగా దేవుణ్ణి కలిసేటువంటి వాస్తవికతను వారు తమ మనో నేత్రములతో చూసి, అనుభూతి చెందుతారు.

ఆ దర్శనం యొక్క ప్రభావం చాలా కలవరపెడుతుంది. మన ఏకైక నిరీక్షణ మధ్యవర్తియేనని మనం తెలుసుకోవడానికి అది దారి తీస్తుంది. మన పాపపు జీవితాన్ని తప్ప మనల్ని మెచ్చుకోవడానికి ఏమి లేదనే స్థితిలో ఒంటరిగా నిలబడటమంటే మనం పూర్తిగా నాశనమయ్యామని అర్థం. ఈ దేవుని సన్నిధిలో నిత్యత్వం కోసం ఏదైనా నిరీక్షణను కలిగి ఉండాలంటే  విమోచకుడు, రక్షకుడు మరియు మనకు బదులుగా ఉండేవాడు మనకవసరం.

ఇటువంటి భయంకరమైన సమయంలో, –“నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన…”(గలతీ 2:20) అనే యేసు క్రీస్తు సువార్త ప్రకాశించినట్లు మరేది ప్రకాశించదు. మరు క్షణంలోనే ఆయన అక్కడ ఉన్నాడు, వేదాంతపరమైన అనుమానంతోనో, కేవలం హేతుబద్ధమైన ముగింపుతోనో, ఒక ఆలోచనతోనో కాకుండా సంపూర్ణ అవగాహన, అనుభూతి మరియు నిర్దిష్టతను కలిగిన అంతర్ దృష్టితో రెప్పపాటున భయంకరమైన తీర్పును, ఆవరిస్తున్న చీకటినంతటిని చూడటానికి నేను అనుమతించబడ్డాను.

మన దేవుడు దహించు అగ్నియైయున్నాడు. ఆయన చెడు వైపు చూడడు. మనం పూర్తిగా నాశానమయ్యాం. నా అపరాధం చాలా పెద్దది, ఎంతో నిజమైనది, అందుచేత ఆ క్షణంలో ప్రశ్నించలేకపోయాను, ఆ క్షణాన సాకులు చెప్పే అవకాశం కూడా లేదు. అదంతా ఆకస్మికంగా జరిగి, అంతటా ఆవరించి, అనంతమైన నిస్సహాయతలో ఉంది.

ఇలాంటి సందర్భంలో  యేసు మాత్రమే చాలా ప్రాముఖ్యమైనవాడు. ఓ క్రీస్తు! ఓ క్రీస్తు! నా హృదయం కృతజ్ఞతలు చెల్లించగలుగుతోందా?! ఓ దేవుని వరమా, నాకున్న ఏకైక అవసరం నీవే!

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...