నిబంధనలో చేర్చబడుట
“అక్కడ దావీదునకు కొమ్ము మొలవ జేసెదను. నా అభిషిక్తుని కొరకు నేనచ్చట ఒక దీపము సిద్ధపరిచియున్నాను. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింప జేసెదను. అతని కిరీటము అతని మీదనే యుండి తేజరిల్లును అనెను.” (కీర్తన 132:17-18)
దేవుడు దావీదునకు ఇచ్చిన వాగ్ధానముల వలన ఎవరు ప్రయోజనం పొందుతారు?
మరొక సారి కీర్తన 132:17-18 చదువుదాం. “అక్కడ దావీదునకు కొమ్ము మొలవ జేసెదను. నా అభిషిక్తుని కొరకు నేనచ్చట ఒక దీపము సిద్ధపరిచి యున్నాను. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింప జేసెదను. అతని కిరీటము అతని మీదనే యుండి తేజరిల్లును అనెను.”
ఇప్పుడు ఆ వాక్యాన్ని యెషయా 55:1,3 తో జతచేసి చూద్దాం: “దప్పిగొనినవారలారా, నీళ్ళయొద్దకు రండి. రూకలు లేనివారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి… నేను మీతో నిత్య నిబంధన చేసెదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను”
పై వచనాలు యేసుక్రీస్తు మొదటి రాకడకు ముందు వ్రాయబడ్డాయి. అయితే సిలువకు ఇటువైపు నుంచి నేను ఆలోచిస్తే, ఆ వాగ్దానాన్ని నా సొంత మాటలలో ఇలా వ్రాస్తాను: మనమేమైయున్నామో లేదా మనం ఏమి చేయగలమో అనే వాటి మీద ఆధారపడకుండా, దేవుడు క్రీస్తులో మనకు ఏమైయున్నాడో అనే దాని పట్ల దాహం కలిగి ఎవరైతే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన దగ్గరకు వస్తారో, ఆయన వారితో నిబంధన చేస్తాడు.
బైబిలు ముగింపులోని ప్రకటన 22:17 బోధించే మాటలు గుర్తున్నాయా? “దప్పి గొనిన వానిని రానిమ్ము; ఇచ్చయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.” ఇది యెషయా కాలంలోని యూదులకు మాత్రమే వ్రాయబడలేదు గాని తన ఆత్మ దాహం తీర్చుకోవడానికి క్రీస్తు దగ్గరకు వచ్చే ఎవరికైనా ఈ మాటలు వర్తిస్తాయి.” నేను [వారితో] నిత్య నిబంధన చేసెదను.” అని దేవుడు అంటున్నాడు.
ఏమిటా నిబంధన? యెషయా 55:3 లో దేవుడు “దావీదునకు చూపిన శాశ్వత కృప” అని అంటున్నాడు. ఈ మాటలను బట్టి ఎలాంటి నిబంధన దేవుడు చేస్తున్నాడో ఆ నిబంధనలో ఎలాంటి భద్రత ఉందో అర్థమవుతుంది. యెషయా 55:3 “నేను మీతో నిత్య నిబంధన చేసెదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను” అనే వాక్యమును నేను ఈ విధంగా అర్ధం చేసుకున్నాను. దావీదుకు చేసిన నిబంధనలో దేవుడు నన్ను కూడా చేర్చుకున్నాడు. దావీదు ఏమైతే ఈ నిబంధన ద్వారా పొందుకుంటాడో నేను కూడా వాటిని క్రీస్తు యేసులో పొందుతాను.
ఈ నిబంధనలో ఏమేమి ఉంటాయి? నా కోసం ఒక కొమ్ము మొలకెత్తుతుంది. అంటే, బహు శక్తివంతమైన ఆ కొమ్ము నా కోసం పోరాడి నన్ను కాపాడుతుంది. నా కోసం దేవుడు సిద్ధం చేసిన దీపం ఉంటుంది. అంటే, వెలుగు నన్ను చుట్టుముడుతుంది మరియు చీకటి నన్ను అధిగమించదు. నా కోసం ఒక కిరీటం ఉంటుంది. అంటే, నేను దావీదు కుమారునితో రాజ్యపాలన చేస్తాను మరియు అతనితో పాటు అతని సింహాసనంపై కూర్చుంటాను. “జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను” (ప్రకటన 3:21).
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవుడు దావీదుకు చేసిన వాగ్దానాల నుండి మనం ప్రయోజనాలను పొందడం. దేవున్ని మనం సరిగ్గా అర్ధం చేసుకుంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతాము. దేవుని శక్తిని, అధికారాన్ని, నమ్మకమైన ప్రేమని మన వ్యక్తిగత ధ్యానాలలో ధ్యానిస్తే మన వ్యక్తిగత ధ్యానాలు ఆశ్చర్యంతో నిండిపోతాయి.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web