“తన మహిమనుబట్టియు, గుణాతిశయమునుబట్టియు, మనలను పిలిచినవాని గూర్చిన అనుభవజ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున, దేవునిగూర్చినట్టియు మన ప్రభువైన యేసునుగూర్చినట్టియునైన అనుభవజ్ఞానమువలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక”. (2పేతురు 1:3-4)
జ్ఞానానికి బైబిల్ ఇచ్చిన ప్రాముఖ్యతను చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను.
2పేతురు 1:3-4 వచనాలను మరొకసారి వినండి: “తన మహిమనుబట్టియు, గుణాతిశయమునుబట్టియు, మనలను పిలిచినవాని గూర్చిన అనుభవజ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున, దేవునిగూర్చినట్టియు మన ప్రభువైన యేసునుగూర్చినట్టియునైన అనుభవజ్ఞానమువలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక”.
అక్షరార్థంగా, భక్తిగా ఉండటానికి మరియు జీవించడానికి కావాల్సిన శక్తి అంతా కూడా జ్ఞానము ద్వారానే వస్తుంది! అద్భుతమైన విషయం కదూ! లేఖనాలలో ఉండే ఉపదేశాన్ని, సిద్ధాంతాన్ని మనం ఎంత విలువైనదిగా పరిగణించాలి! జీవితం మరియు దైవభక్తి అనేవి ప్రమాదంలో ఉన్నాయి.
తెలుసుకోవడం అనేది భక్తికి దారి తీయదు. అవును, అది భక్తికి దారి తీయదు. అయితే, అజ్ఞానం భక్తిహీనతకు దారి తీస్తుంది. ఎందుకంటే, భక్తి చేయడానికి నడిపించే దైవిక శక్తి దేవుని జ్ఞానం ద్వారానే ఇవ్వబడుతుందని పేతురు చెప్తున్నాడు.
ఇక్కడ ఆచరణలో పెట్టాల్సిన మూడు విషయాలు, ఒక హెచ్చరిక మరియు ఒక ఉపదేశం ఉన్నాయి చూడండి;
1. చదవండి! చదవండి! చదవండి! అయితే అనవసరమైన వేదాంత విషయాల మీద మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా జాగ్రత్త వహించండి. “ఆయన మహిమనుబట్టియు, గుణాతిశయమునుబట్టియు మిమ్మును పిలిచినవాని” గురించి సిద్ధాంతపరమైన మంచి పుస్తకాలను చదవండి.
2. ఆలోచించండి! ఆలోచించండి! సమయాన్ని కేటాయించి ఆలోచించండి. మీరు బైబిలును చదివినప్పుడు, బైబిల్ చెప్పే అర్థాన్ని తెలుసుకోవడం కోసం ఆలోచించడానికి సమయాన్ని తీసుకోండి. ప్రశ్నలు అడగండి. వాటిని వ్రాసుకోవడానికి ఒక పుస్తకాన్ని పెట్టుకోండి. అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉండేటువంటి విషయాల ద్వారా ఇబ్బంది పడినా పరవాలేదు. సత్యమనే చెట్టు మీద రెండు విరుద్ధమైన కొమ్మల మూలాన్ని కనుగొనుటకు ప్రయత్నం చేయడం ద్వారా ఉత్తమ అవగాహన కులుగుతుంది.
3. చర్చించండి! చర్చించండి! సత్యాన్ని గురించి ఆసక్తికరంగా పట్టించుకునే చిన్న గుంపులో చేరండి. కేవలం మాట్లాడటానికి మరియు సమస్యలను లేవనెత్తడానికి మాత్రమే ఇష్టపడే గుంపులోనికి చేరొద్దండి. అయితే, వాక్యానుసారమైన సమస్యలకు వాక్యానుసారమైన జవాబులు ఉంటాయని నమ్మే గుంపులో చేరండి, అలాంటివి తప్పకుండ దొరకుతాయి.
హెచ్చరిక: “నా జనులు జ్ఞానములేనివారై నశించుచున్నారు…” (హోషేయ 4:6). “వారు దేవునియందు ఆసక్తిగలవారని వారినిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను; అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు” (రోమా 10:2). అందుచేత, అజ్ఞానానికి సంబంధించిన ఘోరమైన పరిణామాల గురించి జాగ్రత్తపడండి.
ఉపదేశం: “యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి; యెహోవానుగూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి” (హోషేయ 6:3).