“మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులైయుండునట్లు అంతమువరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు.” (1 కొరింథీ 1:8-9)
యేసు తిరిగి వచ్చేంతవరకు మీ విశ్వాసం నిలిచి ఉంటుందని నిర్ధారించుకోవడానికి మీరు దేనిపైన ఆధారపడ్డారు? విశ్వాసుల శాశ్వత భద్రతను మీరు నమ్ముతున్నారా? అనేది ఇక్కడ ప్రశ్న కాదు గాని ఆ భద్రతను ఎలా కాపాడుకుంటున్నాం? అనేదే ప్రశ్న.
మన విశ్వాసపు పట్టుదల అనేది మనం కలిగియున్న సంకల్పం యొక్క విశ్వాస్యత మీద నిర్ణయాత్మకంగా ఆధారపడి ఉందా? లేక “మనం నమ్మకాన్ని కాపాడుకోవడానికి” దేవుని కార్యం మీద నిర్ణయాత్మకంగా ఆధారపడి ఉందా?
దేవుడు నమ్మదగినవాడు మరియు ఆయన పిలిచినవారందరిని ఆయన శాశ్వతంగా కాపాడుతాడనేది లేఖనములో ఉండే అద్భుతమైన గొప్ప సత్యం. మనం శాశ్వతంగా భద్రపరచబడి ఉన్నామనేందుకు మనకున్న నిశ్చయత ఏంటంటే “మనం నమ్మకాన్ని కాపాడుకోవడానికి” అవసరమైన ప్రతిదానిని దేవుడు చేస్తాడనే నిశ్చయతను కలిగి ఉండడమే!
దేవుడు చేసే సహాయంకంటే నిత్యత్వపు నిర్దిష్టత గొప్పదేమీ కాదు. అయితే, ఆ నిర్దిష్టతే దేవుడు పిలిచినవారందరికి చాలా గొప్ప విషయం.
దేవుని పిలుపును మరియు దేవుని సంరక్షణను కలిపి ఈ విధంగా కలిపి చెప్పేటువంటి మూడు వాక్యాభాగాలు ఇక్కడున్నాయి.
- “మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులైయుండునట్లు అంతమువరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు” (1 కొరింథీ 1:8-9).
- “సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందా రహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక ఆలాగు చేయును” (1 థెస్స 5:23-24).
- “యేసుక్రీస్తు దాసుడును, యాకోబు సహోదరుడునైన యూదా, తండ్రియైన దేవునియందు ప్రేమింపబడి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడినవారికి శుభమని చెప్పి వ్రాయునది. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక” (యూదా 1-2). (ఇదే విషయాన్ని రోమా 8:30; ఫిలిప్పీ 1:6; 1 పేతురు 1:5; మరియు యూదా 1:24.)
దేవుడు తాను పిలిచినవారినందరిని శాశ్వతంగా భద్రపరచి కాపాడుతాడని దేవుని “నమ్మకత్వం” మనకు భరోసా ఇస్తోంది.