నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడు చేయుచున్నాను. (రోమా 7:19)
క్రైస్తవులు ఎప్పుడూ ఓటమిలో జీవించరు. అలాగే మనం పాపంపై అన్నిసార్లూ పరిపూర్ణ విజయంతో జీవించము. మరియు ఆయా సమయాల్లో మనం పాపంపై విజయం సాధించడంలో విఫలమైనప్పుడు, రోమా 7:13-25 ఆరోగ్యకరమైన క్రైస్తవుడు ప్రతిస్పందించవలసిన మార్గాన్ని చూపుతుంది.
మనం చెప్పాలి:
1. దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను. (వచనం 22)
2. నేను చేసిన పనిని నేను ద్వేషిస్తున్నాను. (వచనం 15)
3. నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును? (వచనం 24)
4. దేవునికి ధన్యవాదాలు! నా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా విజయం వస్తుంది. (వచనం 25)
మరో మాటలో చెప్పాలంటే, ఏ క్రైస్తవుడూ ఓటమితో జీవించాలనుకోడు. ఏ క్రైస్తవుడూ ఓటమితో జీవించడానికి స్థిరపడడు. కానీ మనం ఓడిపోయినపుడు, దాని గురించి మనం అబద్ధం చెప్పకూడదు.
వేషధారణ, నటన, పరిపూర్ణతవాది లాగా అతిశయించడం, పైపై నవ్వులు అనేవి ఉండకూడదు.
ఇంకా ఎక్కువగా, మా వైఫల్యాల విషయంలో మరియు ఇతరులను అనాలోచితంగా తీర్పు తీర్చడం విషయంలో మాకున్న అంధత్వం నుండి మమ్మల్ని రక్షించు దేవా.
దేవా, ఇతరుల వైఫల్యం కంటే మా వ్యక్తిగత లోపాలును అధ్వాన్నంగా భావించేందుకు మాకు సహాయం చెయ్యండి.
దేవా, ఈ వచనంలో అపొస్తలుడైన పౌలుకున్న నిజాయితీ, నిష్కల్మష ప్రవర్తన మరియు వినయమును మాకు దయచేయండి! “అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.” (రోమా 7:24-25).