ఎలా పశ్చాత్తాపపడాలి?
“మన పాపములను మనము ఒప్పుకొనినయెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును”. (1 యోహాను 1:9)
మీరు మీ పాపముల చేత ఒప్పింపబడడం అనేది, మీరొక క్రూరమైన వ్యక్తి అని మీపట్ల మీకుండే ఒక అస్థిరమైన,చెడు భావనతో సమానం కాదు. కంపు కొట్టిన మీ పాప స్థితిని గుర్తించడమనేది పశ్చాత్తాపానికి సమానం కాదు.
ఈ ఉదయం నేను ప్రార్థించడం ఆరంభించాను, విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్తతో మాట్లాడుటకు నాకు అర్హత లేదనిపించింది. అది అయోగ్యతకు అస్పష్టమైన భావన. ఆ విషయాన్నే నేను ఆయనకు చెప్పాను. ఇప్పుడేం చేయాలి?
నేను చేసిన నా పాపాల గురించి స్పష్టంగా ప్రార్ధించనంత వరకు ఏదీ మారలేదు. ఆ రోత భావాలు కొన్ని నిర్దిష్టమైన పాపాలను ఒప్పించడం కోసం నడిపిస్తే అవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అయితే, చెడు వ్యక్తిగా ఉండి అస్పష్టమైన భావాలను అంటే పైపైన భావోద్వేగాలను కలిగి ఉంటే అవి అంత ఉపయోగకరంగా ఉండవు.
అయోగ్యత అనే పొగమంచు, అవిధేయత అనే స్పష్టమైన చీకటి స్తంభాల ఆకారంలోనికి రావాల్సిన అవసరత ఉంది. ఆ తర్వాత, మీరు వాటిని గుర్తించి, వాటి విషయమై పశ్చాత్తాపపడి, క్షమాపణ అడగాలి. ఆ పాపాల్ని చెల్లా చెదురు చేయడానికి మీ దగ్గర గల సువార్త ఆయుధంతో గురి పెట్టి వాడాలి.
అందుచేత, నేను తరచుగా తిరస్కరించిన ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభించాను. అప్పుడు ఈ క్రింద చెప్పబడిన ఆజ్ఞలు నా మనస్సుకు వచ్చాయి.
- మీ పూర్ణ హృదయంతో, మనస్సుతో మరియు బలంతో దేవుణ్ణి ప్రేమించండి. 95% శాతం కాదు గాని 100% శాతంతో ప్రేమించాలి. (మత్తయి 22:37)
- నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమించండి. మీ కోసం ప్రతీది మంచి జరగాలని మీరెలా కోరుకుంటారో అలాగే నీ పొరుగువాని కోసం కూడా ప్రతీది మంచి జరగాలని కోరుకోవాలి. (మత్తయి 22:39)
- మీరు చేసే ప్రతీది సణుగుడు గొణుగుడు లేకుండా చేయండి. లోపల బయట ఎటువంటి సణుగుడు గొణుగుడు ఉండకూడదు. (ఫిలిప్పీ 2:14)
- మీకున్న ఆందోళనలు చింతలన్నీ ఆయన మీద వేయండి – వాటి ద్వారా ఇకమీదట మీరెన్నటికీ కృంగిపోరు (1 పేతురు 5:7)
- ఇతరులకు, ముఖ్యంగా మీకు దగ్గరగా ఉన్నవారికి కృపను పంచే విషయాలనే చెప్పండి. (ఎఫెసీ 4:29)
- సమయమును వృధాగా పోనియ్యక సద్వినియోగం చేసుకోండి. నిమిషాలను వృధా చేయవద్దు, లేక సోమరిగా ఉండి సమయాన్ని వృధా చేసుకోవద్దు. (ఎఫెసీ 5:16)
గొప్ప పవిత్రత కలిగి ఉండడానికి ఇన్ని నియమాలా! నేను అసంపూర్ణునిగా ఉండిపోతాను.
ఇది అస్పష్టమైన, రోత భావాలకంటే చాలా ఘోరంగా ఉంది. అయితే, ఇప్పుడు శత్రువు బయటకు కనిపించాడు. పాపాలు స్పష్టంగా ఉన్నాయి. ఎక్కడో దాక్కున్నవన్నీ బయటకు వస్తున్నాయి. అవి నా కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. నాకు రోతగా అనిపించేదాని గురించి నేను ఏడవడం లేదు. యేసు ఆజ్ఞాపించిన కొన్ని ప్రత్యేకమైనవాటిని చేయనందుకు నేను ఆయన వద్ద క్షమాపణ అడుగుతున్నాను.
నేను విరిగి నలిగిపోయాను, నా పాపాలను చూసి నా మీద నాకే కోపం వచ్చింది. నేను ఆ పాపాల్ని చంపాలి, నన్ను నేను కాదు. నేను ఆత్మహత్య చేసుకోకూడదు. నేను పాపాన్ని ద్వేషించువాడను, నేను పాప హంతకుడను. (“మీలో ఉన్న భూ సంబంధమైన వాటిని చంపివేయండి,” (కొలొస్స 3:5); “శారీర క్రియలను చంపి వేయండి,” రోమా 8:13) నేను జీవించాలి కాబట్టే నేను నా పాపాలను చంపే హంతకుడిగా ఉన్నాను!
ఇలాంటి పోరాటంలో, “మన పాపములను మనము ఒప్పుకొనినయెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును” (1 యోహాను 1:9) అనేటువంటి వాగ్దానాన్ని విన్నాను. సమాధానం ఇక ఉదయిస్తుంది.
ఇప్పుడు, ప్రార్థన చేయడానికి సాధ్యమని, ప్రార్థన సరియైనదని, శక్తివంతమైనదని మరలా అనిపిస్తోంది.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web
2 Comments
This message is so much useful to me. I used to hesitate to repent about my sins as I was again and again repeating them. This message will help me how I can make my time useful in prayer. Thank you
Good words and usefull my spiritual growth. thank you and Regards.