అవిశ్వాసుల కోసం ఎలా వాదించాలి

షేర్ చెయ్యండి:

“సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణపొందవలెనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై యున్నవి”. (రోమా ​​10:1)

ఇశ్రాయేలును మార్చమని దేవున్ని పౌలు ప్రార్థించాడు. అతను దాని రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాడు! అతను అసమర్థ ప్రభావం కోసం ప్రార్థించడం లేదు, కానీ సమర్ధమైన ప్రభావం కోసం ప్రార్థిస్తున్నాడు. మరియు మనం కూడా అలాగే ప్రార్థించాలి.

మనం దేవుని కొత్త నిబంధన వాగ్దానాలను తీసుకొని వాటిని మన పిల్లలు మరియు మన పొరుగువారిలో మరియు ప్రపంచంలోని అన్ని మిషన్ ఫీల్డ్‌లలో నెరవేర్చమని దేవునికి మనవి చేయాలి.

దేవా, వారి శరీరములలోనుండి రాతిగుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇవ్వండి. (యెహెజ్కేలు 11:19)

యెహోవాను ప్రేమించునట్లు హృదయమునకును సున్నతి చేయును. (ద్వితీయోపదేశకాండము 30:6)

తండ్రీ, నీ ఆత్మను వారియందుంచి, నీ కట్టడలననుసరించువారినిగాను నీ విధులను గైకొనువారినిగాను వారిని చేయుము. (యెహెజ్కేలు 36:27)

సాతాను చెరపట్టిన వీరు వాని యురిలోనుండి తప్పించుకునేలా సత్యవిషయమైన అనుభవజ్ఞానమును మారుమనస్సును వారికి కలుగజేయము (2 తిమోతి 2:25–26)

వారు సువార్తను విశ్వసించేలా వారి హృదయాలను తెరవండి! (అ.కా 16:14) 

మనము దేవుని సార్వభౌమాధికారాన్ని విశ్వసించినప్పుడు – విశ్వాసము మరియు రక్షణ కొరకు కఠినమైన పాపులను ఎన్నుకునే దేవుని హక్కును మరియు శక్తిని విశ్వసించినప్పుడు – అప్పుడు మనం ఎటువంటి అస్థిరత లేకుండా తప్పిపోయిన వారి మారుమనస్సు కోసం గొప్ప బైబిల్ వాగ్దానాలపై విశ్వాసంతో ప్రార్థించగలుగుతాము.

కాబట్టి దేవుడు ఈ రకమైన ప్రార్థనలో సంతోషిస్తాడు ఎందుకంటే ఎన్నిక చేయడంలో మరియు రక్షించడంలో  స్వేచ్ఛా మరియు సార్వభౌమ దేవుడుగా ఉండే హక్కును మరియు గౌరవాన్ని అటువంటి ప్రార్థన ఆయనకు ఆపాదిస్తుంది.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...