దేవుని వాక్యంలో ఎలా ఆనందించాలి?

షేర్ చెయ్యండి:

“నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములుఅవి నా నోటికి తేనెకంటె తీపిగానున్నవి.” (కీర్తన 119:103)

డిమాండ్లు, తీర్మానాలు మరియు ఇష్టాఇష్టాలు అనేటువంటి స్థాయికి క్రైస్తవ్యాన్ని దిగజార్చకండి. ఎందుకంటే, ఇవి కేవలం మనం దేనిని ప్రేమిస్తామో, మనం దేనియందు ఆనందిస్తామో, మనకు ఎటువంటి రుచులను ఇష్టపడతామో అనేటువంటి విషయాల మీద మాత్రమే ఉంటాయి.

యేసు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు, మానవత్వం అనేది మనుష్యులు ఇష్టపడే దానినిబట్టి విభజించబడింది. “వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డైవెనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి” (యోహాను 3:19). నీతిమంతులు మరియు దుష్టులు అనేవారు యేసులోని దేవుని ప్రత్యక్ష్యతలో ఆనందిస్తున్నారా, లేక లోక విధానములో ఆనందిస్తున్నారా అనే దానినిబట్టి వారు వేరుపరచబడుతారు.

దేవుని వాక్యంలో నేను ఎలా ఆనందించగలను? అని ఎవరైనా ప్రశ్నించినప్పుడు, నా జవాబు రెండు విధాలుగా ఉంటుంది:

1) మీ హృదయపు నాలుక మీద క్రొత్త రుచి కోసం ప్రార్థన చేయండి;

2) దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద ధ్యానం చేయండి.

“నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములుఅవి నా నోటికి తేనెకంటె తీపిగానున్నవి” (కీర్తన 119:103)అని చెప్పిన కీర్తనాకారుడే, “నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము” (కీర్తన 119:18) అని ముందుగానే చెప్పాడు. మహిమను చూసేందుకు ఆధ్యాత్మిక నేత్రాలను కలిగియుండడం, లేక హృదయపు నాలుక మీద పరిశుద్ధమైన రుచి కలిగియుండడం అనేది దేవుని వరమని ఆయన ప్రార్థించాడు. ఏ ఒక్కరూ స్వాభావికంగా (సహజ సిద్ధంగా) దేవునిలోను, దేవుని జ్ఞానంలోను ఆనందించరు మరియు ఏ ఒక్కరూ దేవుని కోసం, ఆయన జ్ఞానం కోసం ఆకలిగొనరు.

అయితే, మీరు ప్రార్థన చేసినప్పుడు, మరిముఖ్యంగా మీరు ప్రార్థన చేసేటప్పుడు,దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానములకు సంబంధించిన ప్రయోజనాల మీద మరియు ఇప్పుడు ఎల్లప్పుడూ మీ సహాయకునిగా ఉండే సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి కలిగి ఉన్నారనే ఆనందం మీద ధ్యానం చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తి “నీటికాలువల యోరను నాటబడినదైఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండునుఅతడు చేయునదంతయు సఫలమగును.దుష్టులు ఆలాగుననుండకగాలి చెదరగొట్టు పొట్టువలెనుందురు” అని కీర్తన 1:3-4 వచనాలు చెప్తున్నాయి.

పనికిరాని స్థితి నుండి శక్తిమంతులుగాను, భీడు ప్రదేశాన్ని ఫలవంతమైన తోటగాను ప్రజలను మార్చేటువంటి పుస్తకాన్ని చదవడానికి ఎవరు సంతోషపడరు? వేర్లు లేకుండా, బరువు లేకుండా, పనికి రాకుండా ఉండే పొట్టుగా ఉండాలని ఏ ఒక్కరూ కోరుకోరు. వాస్తవికత యొక్క లోతైన నది నుండి బలాన్ని తెచ్చుకొని, ఫలభరితమైన ఉపయోగకరమైన ప్రజలుగా ఉండాలని మనమందరం కోరుకుంటాం.

ఆ వాస్తవికత యొక్క నది అంటే దేవుని వాక్యమే. ఆ దేవుని వాక్యమనే వాస్తవికత నది ద్వారానే గొప్ప గొప్ప పరిశుద్ధులందరూ గొప్ప చేయబడ్డారు.   

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...