క్షమాపణ ఎలా అడగాలి?

క్షమాపణ ఎలా అడగాలి?

షేర్ చెయ్యండి:

“ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి …” (1 యోహాను 1:9) 

ఒక వ్యక్తి యొక్క వేదాంతాన్ని పరీక్షించే ఒకానొక ఉత్తమ పరీక్ష ఏంటంటే అతని ప్రార్థనలపై ఆ వేదాంతం యొక్క ప్రభావమే అని నా బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్ చెప్పినట్లు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను.

నా జీవితంలో జరిగిన విషయాలను బట్టి ఈ మాట నాకెంతో వాస్తవమనిపించింది. నోయల్ కు, నాకు వివాహం జరిగిన తర్వాత, మేము ప్రతి రోజు సాయంత్రం కలిసి ప్రార్థించడం మా అలవాటుగా చేసుకున్నాము. అదే సమయంలో బైబిల్ కాలేజ్లో నాకున్న వేదాంత జ్ఞానాన్ని లోతుగా తీర్చిదిద్దుతున్న సమయంలో, నా ప్రార్థనలు విపరీతంగా మారుతూ వచ్చాయని నేను గమనించాను.

ఆ రోజుల్లో జరిగిన అతి ముఖ్యమైన మార్పు బహుశా దేవుని మహిమ ఆధారంగా ఆయన ఎదుట నా పరిస్థితిని వినిపించుటను నేర్చుకోవడమే. “నీ నామం పరిశుద్ధపరచబడునుగాక” అని ఆరంభమై, “యేసు నామంలో” అని ముగించడం వెనక ఉన్న అర్థం ఏంటంటే నేను ప్రార్థించిన ప్రతి ప్రార్థన యొక్క లక్ష్యం, ఆధారం – దేవుని నామం మహిమ పొందాలన్నదే.

క్షమాపణ కోస౦ ప్రార్థి౦చడ౦ అనేది కేవలం దేవుని కరుణ కోసం వేడుకోవడం మీద మాత్రమే ఆధారం చేసుకోకుండా, దేవుని కుమారుని విధేయతా విలువకు ఆధారమైన ఆయన న్యాయం కోసం వేడుకోవడం మీదనూ ఆధారపడి ఉ౦డాలని తెలుసుకోవడం నా జీవితానికి ఎంతో బలమిచ్చింది. దేవుడు నమ్మదగినవాడు మరియు ఆయన మీ పాపాలను క్షమిస్తాడు (1 యోహాను 1:9).

అన్ని పాపాల క్షమాపణకు ఆధారం పాత నిబంధనలోకంటే మరింత స్పష్టంగా క్రొత్త నిబంధనలో బహిర్గతం చేయబడింది, అయితే ఆయన నామంపట్ల ఆయనకున్న నిబద్ధత అనే ఆధారం ఎప్పటికీ మారదు.

పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము, తాను ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్నిబట్టి కాకుండా, నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునైయుండుటకు ఆయన ఆలాగు చేసెను (రోమా 3:25-26) అని పౌలు బోధిస్తున్నాడు.

మరొక విధంగా చెప్పాలంటే, పాపులందరిని యేసుని బట్టి వదిలేయడం అనేది దేవుని న్యాయం తీర్చబడలేదన్నట్లుగా అర్ధం చేసుకొనే ప్రమాదం ఉంది. కానీ మనం సరిగ్గా అర్ధం చేసుకుంటే దేవుని న్యాయాన్ని కనుపరచడానికి క్రీస్తు ఒక్కమారే మరణించాడు. అంటే క్రీస్తు మరణాన్ని బట్టి దేవుని నామం ద్వారా పాపులకి క్షమాపణ దొరికింది. దేవుని నామం, నీతి, న్యాయములనేవి క్రీస్తు త్యాగం ద్వారా సంతృప్తిపరచబడ్డాయి.

“ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది; నేనేమందును? – తండ్రీ, యీ గడియ తటస్థింపకుండ నన్ను తప్పించుము; అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని; తండ్రీ, నీ నామము మహిమపరచుమని చెప్పెను. (యోహాను 12:27-28) అని యేసు చివరి ఘడియను ఎదుర్కొన్నప్పుడు చెప్పాడు. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను (రోమా 3:26).

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...