ఆత్మతో నేను ఎలా నింపబడగలను?
“ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడియున్నవి”. (రోమా 15:4)
పరిశుద్దాత్మతో మనం ఎలా నింపబడగలం? మన చుట్టూ ఉన్నవారిని క్రీస్తు కోసం సంపాదించే విధంగా వారిని యదార్థమైన ప్రేమతో ప్రేమించడానికి గొప్ప ఆనందంతో మనల్ని నింపే ఆత్మ శక్తిని ఎలా పొందుకోగలం? మనకు విడుదలను కలుగజేసే, మనల్ని బలపరిచే, మన మీదనూ మన సంఘం మీదనూ కుమ్మరించబడే పరిశుద్ధాత్మను మనం ఎలా అనుభవిస్తాం?
జవాబు: రాత్రింబవళ్ళు నిరీక్షణ కలిగించే సాటిలేని దేవుని వాగ్దానాలను ధ్యానించండి. రోమా 15:4వ వచనం ఇలా చెప్తుంది. “ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడియున్నవి.” పౌలు ఈ వచనంలో చెప్పినట్లుగా తన హృదయాన్ని ప్రేమ నిరీక్షణ మరియు ఆనందముతో నింపుకున్నాడు.
దేవుని వాక్యంలో ఉన్న వాగ్దానాలను ధ్యానం చేయడం ద్వారా నిరీక్షణకు సంబంధించిన సంపూర్ణ నిశ్చయత కలుగుతుంది. ఈ మాట పరిశుద్ధాత్ముడు మనకు నిరీక్షణను కలుగజేస్తాడు అని తొమ్మిది వచనాల తర్వాత (రోమా 15:13లో) చెప్పబడిన మాటతో విబేధించదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు లేఖనాలన్నీ వ్రాసిన దైవిక గ్రంథకర్త. ఆయన వాక్యమే ఆయన కార్యానికి సాధనం. తాను రాయించిన వాక్యంలో ఉన్న వాగ్దానాలతో మనల్ని నింపుట ద్వారా ఆయనే మనకి నిరీక్షణనిస్తాడు. కాబట్టి ఈ మాటతో ఎవరూ విభేదించలేరు.
కడుపు నొప్పి వచ్చినట్లుగా నిరీక్షణ అనేది ఎక్కడినుండో వచ్చే ఏదో ఒక అస్పష్టమైన భావోద్రేకం కాదు. నిరీక్షణ అనేది ఆత్మ వాక్యము ద్వారా మనకు వాగ్దానము చేయబడిన నిజంగా జరగబోయే అద్భుతమైన భవిష్యత్తుకు సంబంధించిన నిశ్చయత. అందుచేత, ఆత్మతో నింపబడటమంటే ఆయన వాక్యంతో నింపబడటమే. ఆత్మ శక్తిని కలిగి ఉండటమంటే దేవుని వాక్యములోని వాగ్దానాలను నమ్మడమే.
ఎందుకంటే, వాగ్దాన వాక్యం మనల్ని నిరీక్షణతో నింపుతుంది, నిరీక్షణ మనల్ని ఆనందంతో నింపుతుంది, మరియు ఆ ఆనందం మనం మన పొరుగువారిని ప్రేమించే శక్తిలోనూ స్వాతంత్ర్యంలోనూ పొంగిపొర్లుతుంది. అదే పరిశుద్ధాత్ముని సంపూర్ణతయై యున్నది.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web