ఆయన సమయం పరిపూర్ణమైనది

షేర్ చెయ్యండి:

మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము (హెబ్రీ 4:16) 

ఈ అమూల్యమైన వచనం, “అవసరమైన సమయంలో సహాయం అందించబడునట్లు కృపను కరుణను పొందుకోవడానికి మనం ధైర్యముతో కృపా సింహాసనం వద్దకు వెళ్దాం” అని సాధారణంగా అనువదించవచ్చునని నాకు తెలుసు. అలా అనువదిస్తే, దేవుడు మనకు అవసరమైనప్పుడు మాత్రమే ఆయన దానిని కనుబరుస్తాడనే అర్థం వచ్చే ప్రమాదముంది. ఎందుకంటే ఈ వచనం సమయోచితమైన సహాయం ఎలా ఉంటుందనే విషయాన్ని వివరిస్తుంది.

మనం ముగించని పరిచర్య అంతా భవిష్యత్తులోనే ఉంటుంది, అంటే ఒక క్షణం, లేక ఒక నెల, ఒక సంవత్సరం, ఒక దశాబ్దం తర్వాతే ఉంటుంది. కాబట్టి మన అసమర్థత గురించి బాధపడటానికి కావాల్సినంత సమయం మనకుంది. మన జీవితంలో అనుకోనిది జరిగినప్పుడు, మనం తప్పనిసరిగా ప్రార్థన వైపుకు మొగ్గు చూపాలి.

ప్రార్థన అంటే రేపటి పరిచర్యకు మనల్ని సమర్థవంతులుగా చేసే కృపతో ఈ రోజు మనలను కలిపే విశ్వాసం యొక్క రూపం. సహాయం సమయానికి రావడం అనేది చాలా ప్రాముఖ్యం.

కృప ముందుగానో లేక ఆలస్యంగానో వస్తే ఎలా? దీనికి సంబంధించిన వాగ్దానం గురించి హెబ్రీ 4:16వ వచనం స్పష్టంగా చెప్పట్లేదు. దాన్ని చూడటానికి మనకు మరింత అక్షరార్థమైన అనువాదం అవసరం. “అవసరమైన సమయ౦లో సహాయ౦ పొందడానికి” మనం కృప కోసం వెళ్ళాలన్నది ఇక్కడ వాగ్దానం కాదు గాని ఆ కృప దేవుని ద్వారా సమయానికి అందించబడుతుందనేదే ఇక్కడ వాగ్దానం.

సమయోచితమైన సహాయం పొందడానికి భవిష్యత్తు కృపకు మార్గం ప్రార్థనే అనేది ఇక్కడ చెప్తున్న విషయం. ఈ దేవుని కృప ఎల్లప్పుడూ సమయానికి “కృపాసనము” నుండి మాత్రమే వస్తుంది. “కృపాసనము” అనే మాటకు, విశ్వానికి రాజైన దేవుని అధికారం ద్వారా కాలాలను నియమించినవాడి నుండి భవిష్యత్తుకు సంబంధించిన కృప వస్తుందని అర్థం (అపొ. కార్య 1:7).

ఆయన సమయం పరిపూర్ణమైంది గాని అది మనకు అరుదుగా ఉంటుంది: “నీ [ఆయన] దృష్టికి వేయి సంవత్సరములు గతించిన నిన్నటివలెనున్నవి” (కీర్తన 90:4). ప్రపంచ స్థాయిలో చెప్పాలంటే “ఆయన యొకనినుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించాడు” (అపొ. కార్య 17:26). వ్యక్తిగత స్థాయిలో చెప్పాలంటే, “నా (మన) కాలగతులు నీ [ఆయన] వశములోనున్నవి” (కీర్తన 31:15) అని చెప్పవచ్చు.

భవిష్యత్తు కృపకు సంబంధించిన సమయం గురించి మనం ఆశ్చర్యపోయినప్పుడు, మనం తప్పనిసరిగా “కృపాసనము” గురించి ఆలోచించాలి. ఉత్తమమైనప్పుడు తన కృపను పంపాలన్న దేవుని ప్రణాళికను ఏదీ అడ్డుకోజాలదు. భవిష్యత్తు కృప ఎల్లప్పుడూ సమయానుగుణంగా అనుగ్రహించబడుతుంది. 

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...