భార్యాభర్తల కోసం హేడోనిజం
“సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, . . . దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను”. (ఎఫెసీ 5:24–25)
ఇదే వివాహ వ్యవస్థలో దేవుడు ఏర్పాటు చేసిన ప్రేమ మాదిరి.
భార్యాభర్తల పాత్రలు ఒకేలా ఉండవు. సంఘమునకు శిరస్సు అయిన క్రీస్తు నుండి భర్త ప్రత్యేక సూచనలను తీసుకోవాలి. భార్య తన ప్రత్యేక సూచనలను క్రీస్తుకు లోబడిన సంఘం కోసం దేవుడు రూపొందించిన వాటి నుండి తీసుకోవాలి.
ఇలా చేయడం వలన, మానవ పతనం మూలముగా వచ్చిన పాపాత్మకమైన మరియు హానికరమైన దుష్పలితాల తిరుగుప్రయాణం ప్రారంభమవుతుంది. మానవ పతనం కారణాన్ని బట్టి ప్రేమపూర్వక శిరస్సుగా ఉండాల్సిన పురుషులు పురుషాదిపత్యంగల శత్రువుల్లాగా, మరికొందరిలో సోమరితనం గలిగిన ఉదాసీనులుగా మారిపోయారు. అలాగే మానవ పతనం స్త్రీ యొక్క తెలివితేటలను మార్చేసింది. ఇష్టపూర్వకంగా లోబడవలసిన స్త్రీలు కొంతమంది మోసకరమైన వినయమును మరియు మరికొందరు మొండిగా లోబడని వారుగా మారిపోయారు.
మెస్సీయ అనగా యేసుక్రీస్తు రెండవ రాకడలో సంభవించే విమోచనా కార్యంలో, ప్రేమపూర్వకంగా అధికారాన్ని చెలాయించడం మరియు ఇష్టపూర్వకంగా లోబడటం అనే సృష్టి క్రమము విచ్ఛిన్నం చేయబడదు గాని పునరుద్ధరించబడుతుంది. భార్యలారా, మీ పడిపోయిన సమర్పణను భద్రపరుచుకోడానికి సంఘ క్షేమం కొరకు దేవుడు కలిగియున్న ఉద్దేశాలను మీరు అనుసరించండి! భర్తలారా, విలాసవంతంగా ప్రేమించే క్రీస్తు పట్ల దేవుడు కలిగియున్న ఉద్దేశాలను అనుసరించడం ద్వారా మీ పడిపోయిన శిరస్సత్వంను విమోచించుకోండి!
నేను ఎఫెసీ 5:21–33లో ఈ రెండు విషయాలను కనుగొన్నాను: (1) వివాహంలో క్రైస్తవ హెడోనిజం యొక్క ప్రదర్శన మరియు (2) దాని నుండి వచ్చే ప్రేరణలు వెళ్లవలసిన మార్గం.
భార్యలారా, మీ మీద “శిరస్సుగా” లేదా నాయకుడిగా దేవుడు నియమించిన భర్తను అంగీకరించి గౌరవించడం ద్వారా మీ భర్త ఆనందంలో మీ ఆనందాన్ని వెదకండి. భర్తలారా, క్రీస్తు సంఘమును నడిపించి మరియు ఆమె కోసం తనను తాను అర్పించుకున్నట్లుగా నడిపించే బాధ్యతను స్వీకరించడం ద్వారా మీ భార్య యొక్క ఆనందంలో మీ ఆనందాన్ని వెదకండి.
నా జీవితంలో దేవుని మంచితనం గురించి నేను సాక్ష్యమివ్వాలనుకుంటున్నాను. నేను 1968లో వివాహం చేసుకున్న అదే సంవత్సరంలో క్రైస్తవ హెడోనిజమ్‌ను కనుగొన్నాను. అప్పటి నుండి, నోయెల్ మరియు నేను, , సాధ్యమైనంత తీవ్రతతో లోతైన, శాశ్వతమైన ఆనందాలను మేము వెంబడించడం ద్వారా యేసుక్రీస్తుకు విధేయత చూపించాము. కొన్నిసార్లు చాలా అసంపూర్ణంగా, చాలా అర్ధహృదయంతో, మేము ఒకరి ఆనందంలో మరొకరు ఆనందాన్ని వెదికాము.
మరియు దాదాపు 50 సంవత్సరాల వివాహం తర్వాత మేము కలిసి ఈ విధంగా సాక్ష్యమివ్వవచ్చు: వివాహం చేసుకునే వారికి, హృదయంలోని కోరికలను నెరవేర్చుకునే మార్గం ఇదే. క్రైస్తవ హెడోనిజానికి వివాహం ఒక మార్గముగా ఉంది. ఒకరి ఆనందంలో మరొకరు వారి ఆనందాన్ని వెతుకుతూ, దేవుడు నియమించిన బాధ్యతను నెరవేర్చినప్పుడు, దేవుని గొప్ప మహిమ కొరకు మరియు మన గొప్ప ఆనందము కొరకు వివాహ మర్మం అయిన క్రీస్తు మరియు సంఘ ఉపమానం ప్రదర్శించబడుతుంది.
జాన్ పైపర్
జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.
సంబంధిత ధ్యానాలు...
ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది
సంస్కరణ
"సంస్కరణ" వాట్సాప్ ఛానెల్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఫేస్బుక్
క్లిక్ చెయ్యండి👆🏿
"సంస్కరణ" ఇన్స్టాగ్రామ్
క్లిక్ చెయ్యండి👆🏿
చిరునామా:
మియాపూర్, హైదరాబాద్, తెలంగాణ.
ఫోన్:
9866436426, 9958799659, 9151519121
ఇమెయిల్:
samskarana2024@gmail.com
©Samskarana – Made with❤️by ABNY Web