“దానికిదే మీకానవాలు; ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి యొక తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడనుండి సర్వోన్నత మైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను”. (లూకా 2:12–14)

ఎవరికి సమాధానం? దేవదూతల స్తుతిలో అంధకారముతో కూడిన ఒక మాట ఉంది. ఆయన అనుగ్రహం ఉన్నవారికి  సమాధానం. ఆయన కిష్టులైన వారికి సమాధానం. కానీ విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపెట్టడం అసాధ్యం (హెబ్రీ 11:6). కాబట్టి, క్రిస్మస్ అందరికీ సమాధానమును కలిగించదు.

“ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి.” (యోహాను 3:19) అని యేసు చెప్పాడు. లేదా వృద్ధుడైన సుమెయోను యేసును చూసినప్పుడు ఇలా అన్నాడు, “ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు, ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడియున్నాడు;” (లూకా 2:34). ఎంతోమంది క్రిస్మస్ రోజు చల్లగా, నిస్సారంగా ఉండడాన్ని మాత్రమే చూస్తారు. మరియు అంతకంటే ఎక్కువ చూడని వారు – వ్యతిరేకించవలసిన సంకేతం.

“ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.” (యోహాను 1:11-12). యేసు తన శిష్యులకు మాత్రమే చెప్పాడు, “శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.” (యోహాను 14:27).

సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును ఆస్వాదించే వ్యక్తులు ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. (ఫిలిప్పీయులు 4:6-7).

దేవుని సమాధానం యొక్క నిధిని తెరిచే తాళం చెవి ఏదంటే దేవుని వాగ్దానాలపై విశ్వాసం. కాబట్టి, పౌలు ఇలా ప్రార్థిస్తున్నాడు, “కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది, విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక.” (రోమా ​​15:13). మరియు మనం దేవుని వాగ్దానాలను విశ్వసించి, ఆనందం, సమాధానము మరియు ప్రేమను కలిగి ఉన్నప్పుడు, దేవుడు మహిమపరచబడతాడు.సర్వోన్నత మైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానం! అన్ని రకాల ప్రజలు, భాషలు, తెగలు మరియు దేశాల నుండి నమ్మిన ప్రతి ఒక్కరికీ సమాధానం.

Author

  • జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

No comments yet

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *