తనకు నచ్చినట్లుగా ఆయన జరిగిస్తాడు

తనకు నచ్చినట్లుగా ఆయన జరిగిస్తాడు

షేర్ చెయ్యండి:

మా దేవుడు ఆకాశమందున్నాడు తనకిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు”. (కీర్తన 115:3)

దేవుడు కార్యం చేసినప్పుడల్లా, ఆయనకిష్టమైన విధానంలోనే ఆయన కార్యమును జరిగిస్తాడని ఈ వచనం బోధిస్తోంది.

దేవుడు తాను ఇష్టపడని పనిని చేయడానికి ఎన్నడూ కట్టుబడి లేడు. అలాగే మరేది చెయ్యలేక తనకిష్టం లేని పనిని చేయడానికి ఆయన ఎప్పుడూ బలవంతం చేయబడడు.

ఆయనకు ఇష్టం వచ్చినట్లుగానే ఆయన చేస్తాడు. అందువలన, ఒక రకంగా, ఆయన చేసే ప్రతి పనిలోనూ ఆయన ఎంతో ఆనందాన్ని కలిగి ఉంటాడు.

ఈ విషయమే మనల్ని దేవుని ముందు తలవంచి, ఆయన సార్వభౌమ స్వాతంత్రాన్ని బట్టి స్తుతించడానికి నడిపిస్తుంది, ఒక రకంగా చెప్పాలంటే,  ఆయన ఎల్లప్పుడూ ఆనందాన్ని ఆదేశాలను అనుసరిస్తూ ఆయన తనకుండే “మంచి ఆనందాన్నిబట్టి” ఆయన స్వేచ్చగా నడుచుకుంటాడు.

దేవుడు ఎప్పుడూ పరిస్థితులకు బాధితుడు కాడు. ఆయన ఇష్టపడని పనిని తప్పనిసరిగా చేయాలనే పరిస్థితిలోనికి ఆయన ఎప్పుడూ బలవంతంగా నెట్టివేయబడడు. ఆయన వెక్కిరించబడడు. ఆయన దేనిలోనూ చిక్కుకోడు, ఎవరి చేత నిందించబడడు లేదా ఆయన ఎప్పటికీ బలవంతం చేయబడడు.

చరిత్రలో ఒకానొక దశలో దేవుడు చేయవలసిన అతి కష్టమైన పనిని చేయవలసివచ్చినా కూడా , అంటే “తన స్వంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయని” (రోమా 8:32) పరిస్థితి ఏర్పడినా, దేవుడు స్వతంత్రంగా ఉండి, ఆయన తనకిష్టమైన దానిని చేశాడు. మరణ౦లో యేసు చేసిన స్వీయ త్యాగం, “దేవునికి అర్పణముగాను బలిగాను” ఉందని పౌలు చెబుతున్నాడు (ఎఫెసీ 5:2). ఈ విషయాన్ని లోతుగా ఆలోచిస్తే, అతి పెద్ద పాపము, గొప్ప మరణము, దేవుని యొక్క కఠినమైన కార్యము – తన కుమారుని మరణం, తండ్రికి ఇష్టమైన పని అయ్యింది.

కల్వరికి యేసు వెళ్ళే దారిలో, ఆయనే స్వయంగా దేవదూతల సైన్యాలను కలిగి ఉన్నాడు. “ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను” (యోహాను 10:18), అంటే ఆయన సంతోషం కోసం, హెబ్రీ 12:2లో చెప్పినట్లుగా, “ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందము కొరకై” సమస్తమును జరిగిస్తాడు. విశ్వ చరిత్రలోనే ఒకానొక సమయంలో యేసు చిక్కుకుపోయినట్లు కనిపించినప్పుడు, ఆయనకు ఇష్టమైన పనిని చాలా ఖచ్చితంగా పూర్తిగా చేశాడు, అంటే మీలాంటి నాలాంటి వారిని నీతిమంతులుగా చేయడంలో తన తండ్రిని మహిమపరచడానికి మరణించాడు.

కాబట్టి, మనం విస్మయం చెంది, ఆశ్చర్యపోదాం. మనం కేవలం దేవుని సార్వభౌమాధికారాన్నిబట్టి మాత్రమే ఆయనను స్తుతించడం మాత్రమే కాకుండా, మన కోసం క్రీస్తు మరణము ద్వారా కలిగిన మన రక్షణను బట్టి, “మా దేవుడు ఆకాశమందున్నాడు తనకిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు” అనే విషయంలోనూ స్తుతించువారముగా ఉన్నాం.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...