అత్యుత్తమ వాక్యభాగం

అత్యుత్తమ వాక్యభాగం

షేర్ చెయ్యండి:

“పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను”. (రోమా 3:25–26)

రోమా ​​3:25-26 బైబిల్‌లోని అత్యంత ముఖ్యమైన వచనాలు కావచ్చు.

దేవుడు పూర్తిగా నీతిమంతుడు! మరియు ఆయన భక్తిహీనులను నీతిమంతులుగా తీరుస్తాడు! నిజమేనా? దోషులను నిర్దోషులుగా ప్రకటిస్తున్న న్యాయమైన న్యాయమూర్తి!

ఇది లేదా అది అని కాదు! రెండూ నిజాలే! ఆయన దోషిని నిర్దోషిగా ప్రకటిస్తాడు, కానీ అలా చేయడంలో ఆయన దోషి కాదు. ఇది ప్రపంచంలోనే గొప్ప వార్త!

  • “మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.” (2 కొరింథీ 5:21). ఆయన మన పాపాన్ని తీసుకుంటాడు. మనము ఆయన నీతిని తీసుకుంటాము.
  • “దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.” (రోమా ​​8:4). ఎవరి శరీరం? క్రీస్తు యొక్క శరీరం. ఆ శరీరంలో ఎవరి పాపం ఖండించబడింది? మనది. అప్పుడు మనకి? ఏ శిక్షావిధియు లేదు!
  • “ఆయన [క్రీస్తు] తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను.” (1 పేతురు 2:24)
  • “మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతులకొరకు నీతిమంతుడైన క్రీస్తు. . . పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను.” (1 పేతురు 3:18-19)
  • ” ఆయన మరణముయొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగలవారమైన యెడల, ఆయన పునరుత్థానముయొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగల వారమై యుందుము.” (రోమా ​​6:5)

మన సృష్టికర్త తీర్పు క్రింద ఉన్నాము మరియు మన పాపంపై శాశ్వతమైన ఉగ్రతను కురిపించడం ద్వారా తన విలువైన కీర్తిని కాపాడుకోవడానికి ఆయన తన స్వంత నీతిగల స్వభావానికి కట్టుబడి ఉన్నాడనేది ప్రపంచంలో అత్యంత భయంకరమైన వార్త అయితే . . . . . . అప్పుడు ప్రపంచంలోని అత్యుత్తమ వార్త (సువార్త!) దేవుడు తన విలువైన మహిమను, తన కుమారుని గౌరవాన్ని మరియు ఎన్నుకోబడిన వారి శాశ్వతమైన రక్షణను గొప్ప చేయడానికి రక్షణ మార్గాన్ని నిర్ణయించి అమలు చేసాడు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు.

జాన్ పైపర్

జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత ధ్యానాలు...