“నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము…” (కీర్తన 86:16)

భవిష్యత్తు కృప అనేది ప్రార్థించే కీర్తనాకారుల నిరంతర అభ్యర్థనగా ఉండేది. వారికున్న ప్రతి అవసరాన్ని తీర్చుకోవడానికి పదేపదే ప్రార్థించేవారు. ప్రతి అత్యవసర పరిస్థితి కోసం భవిష్యత్తు కృపపై ప్రతి రోజు ఆధారపడటానికి వారు మనకు అందమైన మాదిరిని ఇచ్చారు. 

  • వారికి అవసరమైనప్పుడు, “యెహోవా, ఆలకింపుము నన్ను కరుణింపుము యెహోవా, నాకు సహాయుడవైయుండుము” (కీర్తన 30:10) అని కృప కోసం మొర పెట్టారు.
  • వారు బలహీనులుగా ఉన్నప్పుడు, “నాతట్టు తిరిగి నన్ను కరుణింపుము నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము” (కీర్తన 86:16) అని కృప కోసం మొర పెట్టారు.
  • వారికి స్వస్థత అవసరమైనప్పుడు, “యెహోవా, నేను కృశించియున్నాను, నన్ను కరుణించుము యెహోవా, నా యెముకలు అదరుచున్నవి, నన్ను బాగుచేయుము” (కీర్తన 6:2) అని కృప కోసం మొర పెట్టారు.
  • వారు శత్రువులచేత దాడికి గురైనప్పుడు, “నీవు నా పక్షమున వ్యాజ్యెమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాసీనుడవై న్యాయమునుబట్టి తీర్పు తీర్చుచున్నావు” (కీర్తన 9:13) అని కృప కోసం మొర పెట్టారు.
  • వారు ఒంటరితనాన్ని అనుభవించినప్పుడు, “నేను ఏకాకిని, బాధపడువాడను నావైపు తిరిగి నన్ను కరుణింపుము” (కీర్తన 25:16) అని కృప కోసం మొర పెట్టారు.
  • వారు దుఃఖములో ఉన్నప్పుడు, “యెహోవా, నేను ఇరుకున పడియున్నాను, నన్ను కరుణింపుము విచారమువలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము, నా దేహము క్షీణించుచున్నవి” (కీర్తన 31:9) అని కృప కోసం మొర పెట్టారు.
  • వారు పాపము చేసినప్పుడు, “యెహోవా నీ దృష్టియెదుట నేను పాపము చేసియున్నాను నన్ను కరుణింపుము నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసియున్నాను” (కీర్తన 41:4) అని కృప కోసం మొర పెట్టారు.
  • జనంగముల మధ్య దేవుని నామాన్ని ఘనపరచాలని వారు ఆశించినప్పుడు, “భూమిమీద నీ మార్గము తెలియబడునట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడునట్లును దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును గాక ఆయన తన ముఖకాంతి మామీద ప్రకాశింపజేయును గాక” (కీర్తన 67:1-2) అని కృప కోసం మొర పెట్టారు.

నిస్సందేహంగా, ప్రార్థన అనేది పరిశుద్ధుని అంతరంగానికి మరియు భవిష్యత్తు కృపా వాగ్దానానికి మధ్యన విశ్వాసపు గొప్ప అనుసంధానమైయున్నది. పరిచర్య అనేది ప్రార్థన ద్వారా కొనసాగాలని దేవుడు ఉద్దేశిస్తే, భవిష్యత్తు కృపపై ఉంచే విశ్వాసం ద్వారానే పరిచర్య కొనసాగించబడాలని ఉద్దేశించబడింది.

జాన్ పైపర్
జాన్ పైపర్

జాన్ స్టీఫెన్ పైపర్ ఒక అమెరికన్ రిఫార్మ్డ్ బాప్టిస్ట్ వేదాంతవేత్త, పాస్టర్ మరియు మిన్నెసోటాలోని మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెం కాలేజ్ మరియు సెమినరీ ఛాన్సలర్. పైపర్ 33 సంవత్సరాలు మిన్నియాపాలిస్‌లోని బెత్లెహెమ్ బాప్టిస్ట్ చర్చిలో బోధించడానికి మరియు దర్శనానికి పాస్టర్‌గా పని చేసే ముందు, బెతేల్ విశ్వవిద్యాలయంలో ఆరు సంవత్సరాలు బైబిల్ అధ్యయనాలను బోధించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *