… “శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము”,…. (1 తిమోతి 1:11)
1 తిమోతి పత్రికలో ఇది అద్భుతమైన మాట, ఇది బాగా సుపరిచితమైన అనేకమైన బైబిల్ వాక్యాల క్రింద సమాధి చేయబడింది. అయితే, దానిని మీరు తవ్విన తర్వాత, “సంతోషంగా ఉండే దేవుని మహిమగల శుభవార్త” అని తెలుస్తుంది. “శ్రీమంతుడగు” అంటే “స్తుతించబడిన వ్యక్తి” అని అర్థం కాదు గాని “సంతోషంగా ఉన్నవాడు” అని అర్థం.
దేవుని మహిమలో ఉండే గొప్ప విషయం ఏంటంటే ఆయన సంతోషంగా ఉన్నాడన్న విషయమే.
దేవుడు అనంతమైన ఆనందాన్ని నిరాకరించి, సర్వ మహిమాన్వితుడిగా ఉండగలడనేది అపొస్తలుడైన పౌలుకు అర్థం కానటువంటి విషయం. అనంతమైన మహిమాన్వితుడిగా ఉండటమంటే అనంతమైన ఆనందాన్ని కలిగి ఉండడమని అర్థం. “సంతోషంగా ఉండే దేవుని మహిమ” అనే వాక్యాన్ని ఆయన ఉపయోగి౦చాడు, ఎ౦దుక౦టే దేవుడు ఎలాగైతే సంతోషంగా ఉండాలనుకున్నాడో అలా ఉండడమే ఆయనకి మహిమాన్వితమైన విషయం.
మన విస్తృతమైన ఊహకు అందనంత స్థాయిలో ఆయన సంతోషంగా ఉంటాడన్న వాస్తవంలోనే దేవుని మహిమ ఎంతో ఎక్కువగా ఉంటుంది. “దేవుని పరిపూర్ణతలో ఆయన పంచుకునే ఒక భాగ౦ ఆయన స౦తోష౦. ఈ ఆనందం ఆయనలోనే సంతోషించడంలో, ఆనందించడంలో ఉంటుంది; కాబట్టి, సృష్టించబడిన జీవి యొక్క సంతోషం కూడా ఆయనలోనే ఉంటుంది.”
ఇది సువార్తలో ఒక ముఖ్య భాగ౦, “శ్రీమంతుడగు (సంతోషంగా ఉండే) దేవుని మహిమగల సువార్త” అని పౌలు చెబుతున్నాడు. దేవుడు మహిమాన్వితమైన సంతోషంతో ఉన్నాడనేది శుభవార్త. దిగులుగా, విచారకరంగా ఉండే దేవునితో నిత్యత్వాన్ని గడపడానికి ఎవరూ ఇష్టపడరు.
దేవుడు అసంతోషంగా ఉన్నట్లయితే, అప్పుడు సువార్త యొక్క లక్ష్యం, అంటే దేవునితో శాశ్వతంగా ఉండాలనుకునే లక్ష్యం సంతోషకరమైన లక్ష్యం కాదు, అంటే అది సువార్త కానే కాదని అర్థం. అయితే, వాస్తవానికి, “నీ యజమానుని సంతోషములో పాలుపొందుము” (మత్తయి 25:23) అని యేసు చెప్పినప్పుడు, స౦తోష౦గా ఉండేటువంటి దేవునితో నిత్యత్వాన్ని అనుభవించమని ఆయన మనకు ఆహ్వానం పలుకుతున్నాడు.
“మీ యందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను” అని యేసు యోహాను 15:11వ వచనంలో చెప్పాడు. ఆయన సంతోషం, అంటే దేవుని సంతోషం మనలో ఉండాలని, ఆ సంతోషం సంపూర్ణంగా ఉండాలని యేసు చెప్పాడు, అందుకోసమే ఆయన జీవించాడు, మరియు చనిపోయాడు. అందుచేత, సువార్త అంటే “సంతోషంగా ఉండే దేవుని మహిమ సువార్త” అని అర్థం.